




Best Web Hosting Provider In India 2024

Star Maa Serial: గుండె నిండా గుడి గంటలు బాలు పెళ్లి – సీరియల్లో ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదంటున్న ఫ్యాన్స్
Star Maa Serial: స్టార్ మాలోకి టెలికాస్ట్ అవుతోన్న మామగారు సీరియల్లోకి గుండె నిండా గుడి గంటలు బాలు ఎంట్రీ ఇచ్చాడు. శనివారం నాటి ఎపిసోడ్లో సీఐడీ ఆఫీసర్‌గా బాలు కనిపించాడు. ప్రోమోలో బాలు, గంగ పెళ్లి చేసుకున్నట్లుగా చూపించడం ఆసక్తిని పంచుతోంది.

Star Maa Serial: స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న మామగారు సీరియల్లోకి గుండె నిండా గుడి గంటలు బాలు ఎంట్రీ ఇచ్చాడు. బాలు క్యారెక్టర్ ప్రవేశంతో సీరియల్ ఇంట్రెస్టింగ్గా మారింది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్లో క్యాబ్ డ్రైవర్‌గా కనిపించిన బాలు…మామగారులో మాత్రం పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించి సీరియల్ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశాడు.
గంగకు సపోర్ట్…
గంగకు సపోర్ట్‌గా బాలు శనివారం నాటి ఎపిసోడ్ ద్వారా మామగారు సీరియల్లోకి అడుగుపెట్టాడు. తన పేరు ఈశ్వర్ అంటూ పరిచయం చేసుకోవడం ఆసక్తిని పంచింది. ఆ తర్వాత అతడిని గంగ మాత్రం బాలుగా పిలిచింది. మీ పేరు ఈశ్వర్ అని అన్నారు అని గంగ బావ అడగ్గా…నా పూర్తి పేరు ఈశ్వర్ ప్రసాద్. నా మనసు తెలిసిన వాళ్లు మాత్రం బాలు అని పిలుస్తారని బాలు బదులిస్తాడు.
బాలు ట్విస్ట్…
మీ వారు ఎక్కడ అని గంగను బాలు అడిగాడు. అంత బాగానే ఉందని గంగ బదులివ్వగానే బాలు కనిపెట్టాడు. ఆ తర్వాత జరిగిన సంగతి మొత్తం బాలుకు వివరిస్తుంది గంగ. ఆ తర్వాతే తన సీఐడీ నుంచి వచ్చిన స్పెషల్ ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్ అని బాలు ట్విస్ట్ ఇచ్చాడు.
ఎంట్రీతోనే చెంగయ్యను తన ప్రశ్నలతో వణికించాడు బాలు. చెంగయ్య చేసిన కుట్రలను ఈజీగా బయటపెట్టాడు. బాలు మాటలతో చెంగయ్య వణికిపోయినట్లుగా చూపించారు. చెంగయ్య కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ఎంక్వైరీ చేశారు. గంగ ఇంట్లోకి రాగానే ఆమె ఇంటి నుంచి గెంటెయ్యబోతాడు చెంగయ్య. అతడికి బాలు వార్నింగ్ ఇచ్చాడు.
బాలు, గంగ పెళ్లి…
ప్రోమోలో బాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. గంగ, బాలు పెళ్లి చేసుకున్నట్లుగా ప్రోమోలో కనిపించింది. గంగ నా లైఫ్ పార్ట్నర్…ఆమెకు నీకు ఎలాంటి సంబంధం లేదని గంగాధర్‌తో బాలు చెప్పాడు. అతడి మాటలతో గంగాధర్‌తో పాటు చెంగయ్య షాకయ్యారు. శనివారం నాటి ఎపిసోడ్‌కు ప్రోమో హైలైట్‌గా నిలుస్తోంది. గంగా, బాలు పెళ్లి ట్విస్ట్‌ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.
గెస్ట్ రోల్ కాదు…
పెళ్లి సీన్ చూస్తుంటే బాలుది గెస్ట్ రోల్ కాదని, ఫుల్ లెంగ్త్ రోల్లోనే అతడు కనిపించబోతున్నట్లు కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మామగారు సీరియల్లో సుహాసిని, మైకో విజయ్, సార్థక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహాసిని స్వయంగా ఈ సీరియల్‌ను నిర్మిస్తోంది. మామగారు సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు స్టార్ మాలో మధ్యాహ్నం ఒంటిగంటకు టెలికాస్ట్ అవుతోంది.
సంబంధిత కథనం