




Best Web Hosting Provider In India 2024

Cucumber Side Effects: చలువ చేస్తుందనీ, బరువు తగ్గాలనీ కీరదోసను ఎక్కువగా తినేస్తున్నారా? రిస్క్‌లో పడతారేమో తెలుసుకోండి!
Cucumber Side Effects: ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని కీరదోసను అధికంగా తినేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడతారని తెలుసుకోండి. అవును కీరదోసను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల కలిగే 5 ప్రమాదకరమైన నష్టాల గురించి తెలుసుకుందాం రండి.

వేసవి వచ్చిందంటే చలువ చేసే ఆహార పదార్థాలను తినాలని నిపుణులు చెబుతుంటారు. శరీరానికి చలువు చేసే ఆహారాల్లో కీరదోస ఎల్లప్పుడూ ముందుంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా కీరదోస చాలా బాగా సహాయపడుతుందని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తారు. నిజానికి నీటి శాతం, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియంతో పాటు ఇతర ముఖ్య పోషకాలు కలిగి ఉండే కీరదోస శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో కొన్ని ఏంటంటే..
కీరదోస తినడం వల్ల కలిగే లాభాలేంటి?
కీరదోస తినడం వల్ల అనేక లాభాలున్నాయి. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, నీటితో సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో కీరదోస తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే, కీరదోసాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే పొటాషియం కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. మొత్తంగా కీరదోసా శరీరాన్ని చల్లగా ఉంచుతూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
కీరదోసను ఎందుకు ఎక్కువగా తినకూడదు..?
అయితే ఎంత మంచిదైనా మితంగా తినాలనే ఆహార నియమం దీనికి కూడా వర్తిస్తుంది. శరీరానికి చలువు చేస్తుందనీ, బరువు తగ్గడానికి సహాయపడుతుందనీ చాలా మంది దీన్ని అతిగా తినేస్తుంటారు. నిజానికి ఏ ఆహర పదార్థమైన మితంగా తింటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. అతిగా తినడం వల్ల లాభాలకు బదులు నష్టాన్నే కలిగిస్తుంది. కీరదోస కూడా అంతేనట. ఎలాగో తెలుసుకుందాం..
కీరదోస అధికంగా తినడం వల్ల కలిగే 5 నష్టాలు
1. జీర్ణ సంబంధిత సమస్యలు:
కీరదోసలో కుకుర్బిటాసిన్ అనే పదార్థం ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే పొట్టలో గ్యాస్, మలం పలుచబడటం, వాపు వంటి జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు కీరదోసను అధికంగా తీసుకోవడం ప్రమాదకరం.
2. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత:
కీరదోసాలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల తరచూ తలనొప్పి, బలహీనత, హృదయ స్పందనలో అసమాన్యత వంటి సమస్యలు రావచ్చు.
3. తక్కువ రక్తపోటు:
కీరదోసలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గి హైపర్‌కలేమియా వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల వాపు, గ్యాస్, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
4. అధిక నీటి శోషణ వల్ల అసమతుల్యతం:
కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరిగి, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడవచ్చు.
5. అలెర్జీ అవకాశం:
కొంతమందికి కీరదోస అధికంగా తినడం వల్ల అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి. దీని లక్షణాలలో దురద, నోటిలో మంట లేదా చర్మంపై దద్దుర్లు వంటివి ఉన్నాయి.
6. మూత్ర సంబంధిత సమస్యలు:
కీరదోసాలో నీటి శాతం ఎక్కువగా ఉండటం దీన్ని అధికంగా తింటే మూత్రవిసర్జన పెరిగుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ లేదా శరీరంలో ద్రవ అసమతుల్యత రావచ్చు. కీరదోసలో సహజంగానే మూత్రవిసర్జనను పెంచే లక్షణం ఉంటుంది. మూత్రంలొ విసర్జన అధికంగా ఉండే వారు కీరదోసను ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
7. రుచిలో మార్పు:
చాలా ఎక్కువగా తింటే కీరదోస చేదుగా మారి రుచి తగ్గవచ్చు, ఇది తినాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది.
కీరదోసను ఎంత తింటే మంచిది?
కీరదోసను సమతుల్యంగా తీసుకోండి (రోజుకు 1-2 మీడియం సైజు కీరదోసలు తినడం సరిపోతుంది). తినే ముందు బాగా కడగాలి, తద్వారా దానిపై ఉన్న కీటకనాశకాలు లేదా బ్యాక్టీరియా తొలగిపోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు రాత్రి కీరదోస తినకూడదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం