




Best Web Hosting Provider In India 2024

OTT Thriller: ఓటీటీలో తెలుగులోనూ వచ్చిన సూపర్ హీరో థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే
OTT Super Hero Thriller: క్రావెన్ ది హంటర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నాలుగు భాషల్లో ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది.

హాలీవుడ్ సినిమా ‘క్రావెన్ ది హంటర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సూపర్ హీరో థ్రిల్లర్ చిత్రం గతేడాది డిసెంబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో ఆరోన్ టేలర్ జాన్సన్ ప్రధాన పాత్ర పోషించారు. జేసీ చందోర్ దర్శకత్వం వహించారు. క్రావెన్ ది హంటర్ చిత్రం ఇప్పుడు ఇండియాలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
క్రావెన్ ది హంటర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
క్రావెన్ ది హంటర్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. నెట్‍ఫ్లిక్స్‌లో నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
క్రావెన్ ది హంటర్ చిత్రంలో ఆరోన్ జాన్సన్‍తో పాటు ఆరియానా డీబోస్, ఫ్రెడ్ హీచింగర్, అలెసాండ్రో నివోలా, క్రిస్టఫర్ అబాట్, మురాత్ సెవెన్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి రిచర్డ్ వెంక్ కథ అందిండగా.. డైరెక్టర్ చందోర్ దర్శకత్వం వహించారు. బెస్ట్ హంటర్ అయిన క్రావెన్.. సూపర్ హీరోగా మారడం, నేరస్థులను వేటాడడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. మార్వెల్ కామిక్స్ ఆధారంగా ఈ మూవీ రూపొందింది.
బాక్సాఫీస్ డిజాస్టర్
క్రావెన్ ది హంటర్ సినిమా సుమారు 130 మిలియన్ డాలర్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం మొత్తంగా 62 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,110 కోట్లు) కలెక్షన్లు సాధించినట్టు అంచనా. చాలా అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లు సాధించలేకపోయింది.
ఈ మూవీని కొలంబియా పిక్చర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్‍మెంట్, ఆరాద్ ప్రొడక్షన్స్, మ్యాట్ టోల్మాచ్ ప్రొడక్షన్స్ పతాకాలపై అవి అరద్, మాట్ చోల్మాచ్, డేవిడ్ హౌస్‍హోల్టర్ ప్రొడ్యూజ్ చేశారు.
నెట్‍ఫ్లిక్స్‌లో ‘టెస్ట్’
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టెస్ట్ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ శుక్రవారం (మార్చి 4) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించారు. టెస్ట్ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
సంబంధిత కథనం