


Best Web Hosting Provider In India 2024
Pithapuram : టీడీపీ వర్సెస్ జనసేన.. పిఠాపురంలో ఆధిపత్య పోరు.. సోషల్ మీడియాలో డైలాగ్ వార్!
Pithapuram : పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అందుకు కారణమైంది ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన. నాగబాబు పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరగింగి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పిఠాపురంలో ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరింది. టీడీపీ వర్సెస్ జనసేన ఫైట్ మరింత ముదిరింది. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ఎమ్మెల్సీ నాగబాబు సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసైనికుల పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు.
సోషల్ మీడియాలో వార్..
శుక్రవారం (ఏప్రిల్ 4న) కూడా నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలు దగ్గర సీఎస్ఆర్ ఫండ్స్‌తో హెల్త్ సెంటర్ నిర్మిస్తున్నారు. దానికి నాగబాబు శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా అక్కడ ఇరు పార్టీల నాయకులు నినాదాలు చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై చంద్రబాబు పేరు లేదనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో జనసేన, టీడీపీ కేడర్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది.
దూరంగా వర్మ..
నాగబాబు పర్యటనకు టీడీపీ నేత వర్మ దూరంగా ఉన్నారు. దీంతో నాగబాబు వెళ్లిన ప్రతీచోట టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నాగబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. వర్మకు అన్యాయం జరిగిందని ఇక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు.
నాగబాబు కామెంట్స్..
ఇటీవల జనసేన ఆవిర్భావ సభ జరిగింది. దీంట్లోనూ నాగబాబు వర్మను ఉద్దేశించి చులకనగా మాట్లాడారని.. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఒకరు చెప్పారు. అప్పటినుంచి టీడీపీ నాయకులు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని స్పష్టం చేశారు. తాటిపర్తి గ్రామంలోని అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతల విషయంలోనూ రెండు పార్టీల మధ్య వివాదం జరిగింది.
వివాదం ఏంటి..
తాటిపర్తి అపర్ణ దేవి అమ్మవారి ఆలయానికి సంబంధించి.. గత పాలక కమిటీ ఆలయ బాధ్యతలను జనసేన నాయకులకు అప్పగించింది. దీనిని టీడీపీ వ్యతిరేకించింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదం కారణంగా పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారని వార్తలు వచ్చాయి. ఈ దాడిలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్