




Best Web Hosting Provider In India 2024

Pawan Kalyan Tour Cancelled : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు, అధికారుల ప్రకటన
Pawan Kalyan Tour Cancelled : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు రోజుల భద్రాచలం పర్యటన రద్దైంది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించి సీతారాముల కల్యాణ వేడుక కోసం పవన్ కల్యాణ్ భద్రాద్రి వెళ్లాలని భావించారు. అయితే భక్తుల రద్దీ, ఇతర కారణాలతో పవన్ పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Tour Cancelled : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రేపు భద్రాచలంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సీతారాముల కల్యాణం సందర్భంగా నేడు, రేపు పవన్ కల్యాణ్ భద్రాచలంలో పర్యటించాలని భావించారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రికి భద్రాచలంలో బస చేసి, రేపు సీతారాముల కల్యాణం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలను సీతారాములకు సమర్పించాలని షెడ్యూల్ ప్రకటించారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదనే!
ఆదివారం సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమై రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవాలని పవన్ కల్యాణ్ ముందుగా భావించారు. అయితే భద్రాచలం పర్యటనను పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల కల్యాణం వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందేమోనని భావించిన పవన్ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. పర్యటన రద్దుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో అనివార్య కారణాలతో పవన్ పర్యటన రద్దు అయినట్లు ఇంటెలిజెన్స్ డీజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ కల్యాణ్ పర్యటన రద్దు కావడంతో ఆయన అభిమానులు, జనసైనికులు నిరాశకు గురయ్యారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రేపు స్వామివారి కల్యాణం ఎంతో రమణీయంగా నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వామివారి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు భద్రాచలం సీతారాముల కల్యాణ వేడుకలో పాల్గొంటారు.
ఒంటిమిట్టలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు
ఏపీ భద్రాద్రి ఒంటిమిట్టలో శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. రేపు శ్రీ రామనవమి సందర్భంగా ధ్వజారోహణం ఉంటుంది. ఈ నెల 11న ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, ఎండవేడిని తట్టుకునేలా చలువపందిళ్లు ఏర్పాటుచేశారు. ఆలయ పరిసరాల్లో బారీకేడ్లు ఏర్పాటుచేశారు. ఆలయ గోపురాలు, కల్యాణవేదిక, ఇతర ప్రాంతాల్లో పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, విద్యుత్ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కౌంటర్లు తదితర ఏర్పాట్లు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్