



Best Web Hosting Provider In India 2024

Priyadarshi: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చను వాడేసుకున్న ప్రియదర్శి.. వీడియో చూసేయండి
Alekhya Chitti Pickles Row – Priyadarshi: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చను ప్రియదర్శి వాడేసుకున్నారు. సారంగపాణి జాతకం సినిమా ప్రమోషన్ల కోసం ఓ వీడియో చేశారు. ఇది సరదాగా సాగింది. ఆ వీడియో ఇక్కడ చూసేయండి.

కోర్ట్ చిత్రంతో ఇటీవలే మంచి హిట్ సాధించారు ప్రియదర్శి. ఆ మూవీలో తన నటనకు భారీగా ప్రశంసలు పొందారు. నాని నిర్మించిన ఆ లీగల్ డ్రామా చిత్రం సూపర్ హిట్ సాధించింది. ప్రియదర్శి హీరోగా నటించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుంది. ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొంతకాలంగా రచ్చగా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని ప్రమోషన్లను వాడేసుకున్నారు ప్రియదర్శి.
‘కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా’
ప్రియదర్శి, హీరోయిన్ రూప కడవయూర్ తాజాగా ఓ వీడియో చేశారు. ప్రియదర్శి బుక్ చదువుతూ ఉంటే.. మొబైల్‍లో ఓ డ్రెస్ చూపిస్తుంది ప్రియ. రూ.14,999ఆ.. చాలా ఎక్స్‌పెన్సివ్ అని ప్రియదర్శి అంటారు.
“నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా.. అర్థమవుతుందా. రేపు నీ పెళ్లామో, గర్ల్ ఫ్రెండో డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్‌పెన్సివ్ అన్నావనుకో.. వదిలిపడేస్తారు నిన్ను. కెరీర్ మీద ఫోకస్ పెట్టు” అని రూప అన్నారు. దీంతో షాకై దీనంగా చూస్తుంటారు దర్శి. డ్రెస్సే ఖరీదు అంటే బంగారం, ల్యాండ్ ఏం కొనిపెడతావ్ అని రూప చిరాకుగా చెబుతారు. ‘పచ్చళ్ల బిజినెస్ పెడతా నేను’ అని ప్రియదర్శి అన్నారు. ఇలా సరదాగా ఈ వీడియో సాగింది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దర్శి.
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ఇదే..
అలేఖ్య చిట్టి పిక్సిల్స్ నడిపే అమ్మాయి.. ఓ వ్యక్తిని ధూషించారంటూ కొంతకాలంగా రచ్చసాగుతోంది. పచ్చళ్లు చాలా ఎక్కువ ధర ఉన్నాయంటూ ఆ కస్టమర్ అనడంతో.. వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా కెరీర్‌పై ఫోకస్ పెట్టు అంటూ ఆ అమ్మాయి అసభ్యంగా తిట్టినట్టు వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. భారీగా మీమ్స్ వస్తున్నాయి. ఈ రచ్చనే సారంగపాణి జాతకం చిత్రం ప్రమోషన్‍కు ప్రియదర్శి, రూప వాడేసుకున్నారు.
సారంగపాణి జాతకం మూవీకి సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ డ్రామా చిత్రంలో ప్రియదర్శి, రూపతో పాటు వెన్నెల కిశోర్, వైవా హర్ష, వెన్నెల కిశోర్, నరేశ్, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు.
సారంగపాణి చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. పీజీ విందా సినిమాటోగ్రఫీ చేశారు. గతేడాదిలోనే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదాలు పడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇటీవలే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది.
సంబంధిత కథనం