




Best Web Hosting Provider In India 2024

Alekhya Chitti Pickles : అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో కలకలం, సారీ చెప్పిన అలేఖ్య- వివాదం ముగిసినట్టేనా?
Alekhya Chitti Pickles : సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం కొనసాగుతోంది. పచ్చళ్ల ధరలు గురించి అడిగినందుకు అలేఖ్య చిట్టి ఓ కస్టమర్ ను అసభ్యకరంగా దూషించడంతో వివాదం మొదలైంది. తాజాగా అలేఖ్య చిట్టి క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.

Alekhya Chitti Pickles : అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం… సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. పికిల్స్ రేటు గురించి అడిగినందుకు అలేఖ్య బూతు పంచాగం ఎత్తడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అలేఖ్య పికిల్స్ మూతపడే స్థాయికి చేరుకుంది. అయితే తాజాగా ఈ వివాదానికి కారణమైన అలేఖ్య సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అసభ్యపదజాలంతో దూషించడంపై క్షమాపణలు చెప్పారు. ఇప్పటికైనా ఈ వివాదానిపు ఫుల్ స్టాప్ పడుతుందో? లేదో? వేచిచూడాలి.
సోషల్ మీడియాలో వైరల్
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియోలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో అలేఖ్య ఆడియోలు హల్ చల్ చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అలేఖ్య అక్క సుమ, చెల్లెలు రమ్య కంచర్ల పచ్చళ్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇటీవల పచ్చళ్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న ఓ కస్టమర్ కు ఆడియో రిప్లై ఇచ్చిన అలేఖ్య….అసభ్యకర రీతిలో దూషించింది. దీంతో వివాదం ముదిరింది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రెండ్ అవుతుండడంతో…అలేఖ్య అక్క, చెల్లెలు సోషల్ మీడియాలో ముందుకొచ్చి సారీ చెబుతూ సంజాయిషీ ఇచ్చుకున్నారు.
అసలు ఈ వివాదానికి కారణమైన అలేఖ్య మాత్రం సైలెంట్ గా ఉండడంతో…ఆమె సారీ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. తాజాగా అలేఖ్య సోషల్ మీడియాలో స్పందించారు. క్షమాపణలు చెబుతూ అలేఖ్య ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో “నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఇప్పటి వరకూ తాను తిట్టిన వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అని తెలిపారు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఒక్క ఆడియో దెబ్బకు బంద్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మళ్లీ ఓపెన్ అవుతుందో? లేదో? చూడాలి.
అసలేంటి వివాదం?
అలేఖ్య చిట్టి, సుమ, రమ్య ముగ్గురు అక్కాచెల్లెళ్లు. రాజమండ్రిలో వెబ్, నాన్ వెజ్ పచ్చళ్ల బిజినెస్ చేస్తున్నారు. వీరు పచ్చళ్లు తయారీ క్రమాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. వీరి వీడియోలు ఇన్ స్టా, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. దీంతో వీరికి మార్కెట్ లో మంచి పబ్లిసిటీ వచ్చింది. వీరు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇందులో హాయ్ అని పెట్టగానే నాన్ వెడ్ పచ్చళ్ల రేట్లు వస్తాయి. ఇలా ఓ కస్టమర్ హాయ్ అని పెట్టగానే ఓ లిస్ట్ వచ్చింది. ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయని కస్టమర్ ప్రశ్నించగా…ఓ ఆడియో మెసేజ్ వచ్చింది.
“నువ్వు కెరీర్ పై ఫోకస్ పెట్టు, పచ్చడే కొనలేకపోతున్నావ్…రేపు నీ భార్యకు బంగారం ఏం కొంటావ్” అంటూ అలేఖ్య చిట్టి అసభ్యకరంగా మాట్లాడిన ఓ ఆడియో వచ్చింది. ఈ ఆడియోను ఆ కస్టమర్ సోషల్ మీడియోలో పోస్టు చేశారు. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం మొదలైంది. ఈ ఘటనతో వారి వ్యాపారం, వ్యక్తిగత ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ తో వారి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశారు.సోషల్ మీడియా ఖాతాల్లో మెసేజ్ ఆప్షన్ బ్లాక్ చేశారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వెబ్‌సైట్ ప్రస్తుతం “Coming Soon” అనే మెసేజ్‌తో కనిపిస్తుంది. అలేఖ్య చిట్టి సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్