HUC Lands Issue : నెమళ్లు ఏడ్చినట్లు, జింకలు గాయపడినట్లు- ఏఐతో ఫేక్ వీడియోలు : హెచ్సీయూ వివాదంపై సీఎం సమీక్ష

Best Web Hosting Provider In India 2024

HUC Lands Issue : నెమళ్లు ఏడ్చినట్లు, జింకలు గాయపడినట్లు- ఏఐతో ఫేక్ వీడియోలు : హెచ్సీయూ వివాదంపై సీఎం సమీక్ష

Bandaru Satyaprasad HT Telugu Updated Apr 05, 2025 07:21 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Updated Apr 05, 2025 07:21 PM IST

HUC Lands Issue : గత 25 ఏండ్లుగా కంచె గచ్చిబౌలిలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, అయినా అప్పుడు లేని వివాదం ఇప్పుడెందుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. హెచ్సీయూ భూవివాదానికి ఏఐ ఫేక్ కంటెంట్ కారణమని అధికారులు సీఎంకు తెలిపారు.

: నెమళ్లు ఏడ్చినట్లు, జింకలు గాయపడినట్లు- ఏఐతో ఫేక్ వీడియోలు : హెచ్సీయూ వివాదంపై సీఎం సమీక్ష
: నెమళ్లు ఏడ్చినట్లు, జింకలు గాయపడినట్లు- ఏఐతో ఫేక్ వీడియోలు : హెచ్సీయూ వివాదంపై సీఎం సమీక్ష
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

HUC Lands Issue : హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

25 ఏండ్లగా ఎన్నో ప్రాజెక్టులు

కంచె గచ్చిబౌలి లోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్ లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్ లను నిర్మించారు. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు.

అలాంటప్పుడు అదే సర్వే నెంబర్ లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది.

అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాస్తవాలు వెల్లడించే లోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు సీఎంకు వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు.

ప్రముఖులు ట్వీట్లు అబద్ధాలకు ఆజ్యం

వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వాళ్లందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది.

ఈ భూములపై మొట్ట మొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్దిసేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఏఐ ఫేక్ కంటెంట్ తో దేశాల మధ్య యుద్ధాలు

ఇదే తీరుగా ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ప్రమాదముంటుందని చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్ ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్ ను సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

HcuCentral UniversityTelangana NewsTrending TelanganaTelugu NewsCm Revanth Reddy
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024