




Best Web Hosting Provider In India 2024

Mahesh Babu Passport: పాస్‌పోర్ట్‌తో మహేష్ బాబు ఎస్కేప్..ఎయిర్‌పోర్ట్‌లో వీడియో వైరల్..రాజమౌలి చూస్తే ఏమంటారో!
Mahesh Babu Passport: శనివారం (ఏప్రిల్ 5) హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో మహేష్ బాబు కనిపించడం వైరల్ గా మారింది. అంతే కాకుండా తన పాస్‌పోర్ట్‌ను ఫొటోగ్రాఫర్స్ కు చూపించారు. దీంతో సితారా, మహేష్ నవ్వుకున్నారు. దీని వెనుక కారణమేంటో.. రాజమౌలి తో కనెక్షన్ ఏంటో చూసేయండి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన డాటర్ సితారాతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. శనివారం (ఏప్రిల్ 5) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వీళ్లు కనిపించారు. అయితే ఫ్యామిలీతో కలిసి మహేష్ తరచూ వెకేషన్ కు విదేశాలకు వెళ్లడం తెలిసిందే. కానీ ఈ సారి ఆయన పాస్‌పోర్ట్‌తో కనిపించడ మాత్రం వైరల్ గా మారింది. దీని వెనుక ఓ రీజన్ ఉంది. టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌలి కనెక్షన్ ఉంది.
షూటింగ్ నుంచి బ్రేక్
రాజమౌలి డైరెక్టర్ గా, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ నుంచి సూపర్ స్టార్ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కూతురు సితారాతో కలిసి ఫారెన్ కంట్రీకి వెళ్లిపోయారు. ఎయిర్ పోర్ట్ లో ఫొటోగ్రాఫర్స్ కు పాస్‌పోర్ట్ చూపిస్తూ ఈ టాలీవుడ్ ప్రిన్స్ నవ్వులు చిందించారు.
వైరల్ వీడియో
ఓ ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. మహేశ్ టీ-షర్టుపై షర్ట్ వేసుకుని.. ప్యాంటు, టోపీ ధరించి విమానాశ్రయంలోకి సితారాతో కలిసి వచ్చాడు. ఫోటోగ్రాఫర్లను చూసినప్పుడు ఆయన పెద్ద చిరునవ్వుతో తన పాస్‌పోర్ట్ చూపించాడు. దీంతో ఆయన కుమార్తె కూడా నవ్వింది. షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు థంబ్స్ అప్ చూపించి మహేశ్, సితారా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
ఈ వీడియో వైరల్ గా మారింది. దీనికి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ‘నాటీ బాబు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు “బాబు పాస్‌పోర్ట్ చూపించడం ఎపిక్” అని రాశారు.
పాస్‌పోర్ట్ సీజ్ చేసిన రాజమౌళి
మహేష్ షూటింగ్ నుండి విరామం తీసుకొని తన కుటుంబంతో సమయం గడపడానికి విదేశాలకు వెళ్లడం తెలిసిందే. ఇంటర్వ్యూలలో కూడా ఆయన తరచుగా దీని గురించి మాట్లాడారు. తన కుటుంబం తనకు చాలా ముఖ్యమని, అందుకే షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటానని చెప్పారు.
మరోవైపు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో ఈ ఏడాది జనవరిలో ఫిల్మ్ స్టార్ట్ అయింది. ఆ సమయంలో మహేష్ ఎక్కడికి వెళ్లకుండా, ఆయన ఫొటోను సీజ్ చేసినట్లు రాజమౌళి పెట్టిన వీడియో వైరల్ అయింది. బ్యాక్ గ్రౌండ్ లో లయన్ ను బంధించి, పాస్‌పోర్ట్‌తో నిలబడ్డ రాజమౌళి వీడియో వైరల్ గా మారింది. దీనికి మహేష్ “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అని రిప్లే కూడా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మహేష్ వెకేషన్ వెళ్లడం, పాస్‌పోర్ట్ చూపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనిపై రాజమౌళి ఎలా రియాక్టవుతారో చూడాలి.
ఓ షెడ్యూల్ కంప్లీట్
రాజమౌళి, మహేష్ కాంబోలో రూపు దిద్దుకుంటున్న సినిమా.. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్ అని తెలిసిందే. ప్రియాంక చోప్రా, ప్రిథ్వీరాజ్ సుకుమారన్ దీనిలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. కానీ ఈ షూటింగ్ సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకు రావడం సినిమా యూనిట్ కు ఇబ్బందిగా మారింది.
సంబంధిత కథనం