




Best Web Hosting Provider In India 2024

Siddhu Jonnalagadda: వైష్ణవి చైతన్య నన్ను కొట్టింది: హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ఎందుకంటే..
Siddhu Jonnalagadda on Vaishnavi Chaitanya: జాక్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య. షూటింగ్‍లో తనను వైష్ణవి కొట్టేదని సిద్ధు చెప్పారు. ఎందుకో కారణం కూడా వెల్లడించారు.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ‘జాక్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే వారం ఏప్రిల్ 10వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ యాక్షన్ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ మెప్పించింది. జాక్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు సిద్ధు, వైష్ణవి. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
వైష్ణవి నన్ను కొట్టేది
తాను ఏదైనా మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు వైష్ణవి డైలాగ్ మరిచిపోయేదని, అప్పుడు సరదాగా తనను కొట్టేదని సిద్ధు చెప్పారు. వైష్ణవి మంచి యాక్టర్ అని, ఒకటి రెండు టేక్‍ల్లోనే చాలా సీన్లు చేసినట్టు తెలిపారు.
మంచి నటిలో ఉండాల్సిన లక్షణాలు వైష్ణవిలో ఏమైనా గమనించారా అనే ప్రశ్న సిద్ధుకు ఎదురైంది. దీనికి స్పందించారు. “వైష్ణవి మంచి యాక్టర్. మేం సీన్ అనుకుంటే ఒకటి, రెండు టేక్‍ల కంటే ఎక్కువ అయ్యేవి కాదు. అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నవ్వేసి డైలాగ్ మరిచిపోయేది. మరిచిపోయిన వెంటనే కొన్నిసార్లు కొట్టేస్తది. లేకపోతే తనే సారీసారీ అనేస్తుంది” అని సిద్ధు అన్నారు. జాక్ చిత్రంలో వైష్ణవి పాత్ర చాలా ముఖ్యమైనది, ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదని అన్నారు.
రెండు సినిమాలు రాసుకున్నా..
తాను రెండు సినిమాలు రాసుకున్నానని సిద్ధు చెప్పారు. కృష్ణ అండ్ హిస్ లీల మూవీ ఫేమ్ డైరెక్టర్ రవికాంత్ దర్శకత్వం వహిస్తారని అన్నారు. కాగా, బ్లాక్‍బస్టర్స్ టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలకు కూడా సిద్ధునే కథ రాశారు.
జాక్ చిత్రంలో సిద్ధు, వైష్ణవి చైతన్యతో పాటు ప్రకాశ్ రాజ్‍ది కూడా కీలక పాత్ర. ఈ మూవీలో టెర్రరిస్టులను అంతం చేసే ఓ ఏజెన్సీ సీక్రెట్ ఏజెంట్ జాక్ పాత్ర చేశారు సిద్ధు. ట్రైలర్లో యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టారు. రొమాన్స్, డైలాగ్స్, స్వాగ్‍తో మెప్పించారు. వైష్ణవి కూడా ఆకట్టుకున్నారు. ఈ ట్రైలర్ చిత్రంపై హైప్ పెంచింది.
జాక్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ పట్టాలని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని సిద్ధు నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాలో చార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషన్ రేంజ్‍లో ఉంటుందని ఇటీవల క్రేజ్ పెంచేశారు. ఈ మూవీకి అచ్చు రాజమణి, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు. ఎస్‍వీసీసీ పతాకంపై బీవీఎస్‍ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ చేశారు. ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందోమో చూడాలి.
సంబంధిత కథనం