




Best Web Hosting Provider In India 2024

AP Inter Students : ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఏప్రిల్ నెల బస్ పాస్ లు రెన్యువల్
AP Inter Students : ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఇంటర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఏటా ఆర్టీసీ మార్చి వరకే రాయితీపై బస్ పాస్ లు జారీ చేసేది, అయితే ఈసారి ఏప్రిల్ నెల బస్ పాస్ లు కూడా రెన్యువల్ చేసింది.

AP Inter Students : ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కాస్త ముందుగా సీనియర్ ఇంటర్ తరగతులు ప్రారంభించారు. గతంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు పూర్తైన తర్వాత సెలవులు ఇచ్చేవారు. అయితే ఈసారి గతానికి భిన్నంగా ఏప్రిల్‌లోనే సీనియర్ ఇంటర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు. 2025-26 విద్యా సంవత్సరాన్ని ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అడ్మిషన్లు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.
ముందు నిరాకరణ
ఇంటి నుంచి కాలేజీకి వెళ్లే విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యం కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి సమీప పట్టణాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఎంతోగానో ఉపయోగపడతాయి. సాధారణ బస్ పాస్ ల కంటే విద్యార్థుల బస్ పాస్ లను రాయితీపై అందిస్తారు. ఏటా జూన్ నుంచి మార్చి వరకు ఇంటర్ విద్యార్థులకు తరగతులు జరిగేవి కనుక అందుకు అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం బస్ పాస్‌లు జారీ చేసేది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించారు. ఇంటర్ బోర్డు అధికారులు ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు తెలియజేశారు. అయితే బస్ పాస్ లు రెన్యువల్ చేసేందుకు ఆర్టీసీ సిబ్బంది నిరాకరించారు.
ఏప్రిల్ పాస్ లు రెన్యువల్
విద్యార్థుల బస్ పాస్ ల రెన్యూవల్ విషయం మీడియాలో రావడంతో…ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ఏప్రిల్ నెల కూడా రాయితీ బస్ పాస్‌లు రెన్యువల్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, డిపోల అధికారులకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటర్ విద్యార్థులకు కాస్త ఉపశమనం లభించింది.
ఏపీ ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలను ప్రకటించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1న ప్రారంభమయ్యాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్ష మార్చి 19న, రెండో సంవత్సరం పరీక్ష మార్చి 20న ముగిసింది. ఆ వెంటనే బోర్డు వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఫలితాలు ప్రకటించడానికి వేగంగా చర్యలు చేపడుతోంది.
ఏపీ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ అధికారిక సైట్‌లతో పాటు.. ఫలితాలు ప్రకటించిన తర్వాత కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఎలా చెక్ చేసుకోవాలి
ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాక సులభంగా రిజల్ట్ తెలుసుకోవచ్చు. అందుకోసం ఇలా చేయాలి.
స్టెప్ 1: BIEAP అధికారిక వెబ్‌సైట్, bieap.gov.in కు వెళ్లాలి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సైన్ ఇన్ చేయాలి.
స్టెప్ 4: మీ ఏపీ ఇంటర్మీడియట్ ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
స్టెప్ 5: మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసి.. భవిష్యత్తు ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.
ఎప్పుడు విడుదలవ్వొచ్చు..
ఏప్రిల్ 12 లేదా 13వ తేదీల్లో ఏపీ ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2024లో ఏప్రిల్ 12న, 2023లో ఏప్రిల్ 26న, 2022లో జూన్ 22న, 2021లో జులై 23న, 2020లో జూన్ 12న ఫలితాలను ప్రకటించారు.
సంబంధిత కథనం
టాపిక్