SAAP Chairman On RK Roja : కోట్లు నొక్కేసి బంగారు నగలు, నెక్లెస్ లు, త్వరలో రోజా అరెస్టు ఖాయం- శాప్ ఛైర్మన్ రవి నాయుడు

Best Web Hosting Provider In India 2024

SAAP Chairman On RK Roja : కోట్లు నొక్కేసి బంగారు నగలు, నెక్లెస్ లు, త్వరలో రోజా అరెస్టు ఖాయం- శాప్ ఛైర్మన్ రవి నాయుడు

Bandaru Satyaprasad HT Telugu Published Apr 05, 2025 09:49 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Apr 05, 2025 09:49 PM IST

SAAP Chairman On RK Roja : అధికారం అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడ్డి, కోట్లకు కోట్లు నొక్కేసి నగలు, నెక్లెస్ లు కొనుగోలు చేశారని మాజీ మంత్రి రోజాపై శాప్ ఛైర్మన్ రవి నాయుడు విమర్శలు చేశారు.త్వరలో రోజా అరెస్ట్ ఖాయమన్నారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా
మాజీ మంత్రి ఆర్కే రోజా
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

SAAP Chairman On RK Roja : వైసీపీ ప్రభుత్వంలో పేద క్రీడాకారుల డబ్బులను మాజీ మంత్రి రోజా అప్పనంగా దోచేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు విమర్శించారు. అధికారం అడ్డంపెట్టుకుని రోజా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, త్వరలో రోజా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చెన్నైలో ఉండే రోజాకు ఏపీలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో వైసీపీ నేతలు పగటి వేషగాళ్లలా తయారయ్యారని విమర్శలు చేశారు.

రోజా అరెస్ట్ ఖాయం

వైసీపీ హయాంలో పేద క్రీడాకారులకు చెందిన రూ.119 కోట్లను మాజీ మంత్రి రోజా కాజేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. రోజా అవినీతి త్వరలోనే బట్టబయలు అవుతుందని చెప్పారు. కోట్లకు కోట్లు నొక్కేసి బంగారు నగలు, నెక్లెస్‌లు కొనుగోలు చేశారని, రోజా బండారం అంతా మరికొన్ని రోజుల్లో బయటపడుతుందన్నారు. ఆమె అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందన్నారు. రోజాను అరెస్టు చేయడం ఖాయమని, తనను అరెస్టు చేయమని పదే పదే కోరనక్కరలేదని ఎద్దేవా చేశారు.

రోజా వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లు పరిమితమైందని రవి నాయుడు విమర్శించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్లు చెప్పారు. చెన్నైలో ఉంటున్న రోజా ఏపీ అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వీకెండ్ పొలిటీషియన్ గా మారారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో బిజినెస్ చేసుకుంటూ వైసీపీని, కార్యకర్తలను గాలికి వదిలేశారని, జగన్ ఇకపై కర్ణాటకలో స్థిరపడాలని హితవు పలికారు.

వైసీపీ నేతల పగటి వేషాలు

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోనే ఛార్జీలు పెంచారన్నారు. ఆ భారమే ఇప్పుడు ప్రజలపై పడుతుందని శాప్ ఛైర్మన్ చెప్పుకొచ్చారు. కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా తిరుపతి వైసీపీ నేతలు పగటివేషాలు వేస్తున్నారని విమర్శలు చేశారు. టీడీఆర్ బాండ్ల బాధితుల ముందుకు భూమన అభినయరెడ్డి వస్తే ప్రజలే బుద్ధి చెప్తారని శాప్ ఛైర్మన్ రవి నాయుడు హెచ్చరించారు.

ఆడుదాం ఆంధ్రలో ఎలాంటి అవినీతి లేదు – మాజీ మంత్రి రోజా

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని మాజీ మంత్రి రోజా ఇటీవల అన్నారు. ఆడుదాం ఆంధ్రలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఈ వ్యవహరంలో తనకు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆడుదాం ఆంధ్రలో అంతా పారదర్శకంగా జరిగిందన్నారు.

వైసీపీలో ఉన్న బలమైన నేతలను తొక్కడానికి కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసి సంబరాలు చేసుకోవాలని ఆశ పడుతున్నారన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Rk RojaAndhra Pradesh NewsYsrcpTdpAp PoliticsTirupati
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024