



Best Web Hosting Provider In India 2024

Sri Rama Navami Wishes 2025: శ్రీరాముడి పట్ల భక్తి ప్రేమతో నిండిన అద్భుతమైన శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇవిగో
Sri Rama Navami Wishes 2025: శ్రీరామనవమి హిందూమతంలో ప్రధాన పండుగ. ఈ వేడుకకు బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇక్కడ మేము శ్రీరామ శుభాకాంక్షలు, కోట్స్, సందేశాలు తెలుగులోనే ఇచ్చాము.

శ్రీరామనవమి ప్రధానమైన పండగల్లో ఒకటి. ఇది శ్రీరాముని జన్మదినమే కాదు… శ్రీరాముడు సీతాదేవిలా వివాహ మహోత్సవం జరిగిన రోజు కూడా. చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథినాడు ఈ అద్భుతమైన ఘట్టం జరిగింది. శ్రీరామనవమికి శ్రీరాముడి ఆశీస్సులు బంధుమిత్రులకు అందరికీ అందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.
శ్రీరామనవమి నాడు శ్రీరాముని ఆలయాల్లో పూజలు చేస్తారు. రామ కథను వినిపిస్తారు. సీతాదేవి శ్రీరాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. శ్రీరాముని ఆశీస్సులు పొందడానికి ఇక్కడ మేము శ్రీరామనవమి శుభాకాంక్షలు అందజేశాము. మీకు నచ్చిన సందేశాన్ని ఎంపిక చేసి మీ బంధుమిత్రులకు పంపించండి.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుగులో
1. శ్రీరాముని ఆశీస్సులతో
ఈ దేశంలోని ప్రతి ఇల్లు
ఆనందం శాంతి శ్రేయస్సుతో నిండి పోవాలని
కోరుకుంటున్నాము
శ్రీరామనవమి శుభాకాంక్షలు
2. రాముని కథ
రామనామం
రాముని ఆరాధన
ఇవన్నీ మీ జీవితంలో అద్భుతమైన మార్పును
ఆనందాన్ని తీసుకురావాలని
మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
శ్రీరామనవమి శుభాకాంక్షలు
3. శ్రీరాముని జీవితం నుండి
సత్యం ధర్మం నైతిక మార్గం అనే అంశాలను నేర్చుకోవాలి
అతని జీవితమే మార్గదర్శకంగా
అందరూ నడవాలి
శ్రీరామనవమి శుభాకాంక్షలు
4. రాముని ఆదర్శాలను పాటించడం ద్వారా
మన జీవితంలో నిజమైన ఆనందం సంతృప్తిని పొందవచ్చు
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలు
5. శ్రీరాముని పాదాలను శరణు వేడితే
మీ జీవితంలో ఏ కష్టం మీ దరి చేరదు
అతడు మీ ప్రతి సమస్యను తీర్చే
మార్గంలా కనిపిస్తాడు
హ్యాపీ శ్రీరామనవమి
6. శ్రీరాముడిని పూజించడం వల్ల
ఆశీర్వాదాలు మాత్రమే కాదు
జీవితంలోని ప్రతి అంశంలోనూ విజయం లభిస్తుంది
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలు
7. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల
మీ జీవితంలోని దుఃఖం తొలగిపోతుంది
ఆనందం వెల్లివిరుస్తుంది
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
8. శ్రీరాముని ఆశీస్సులతో
మీరు ప్రతిరోజు సంతోషంగా,
సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
9. రాముడు సద్గుణాలను దృష్టిలో ఉంచుకొని
సత్యమైన కరుణామయమైన జీవితాలను
గడిపేందుకు ప్రయత్నిద్దాం
ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
10. రాముడు చూపించిన ధర్మం, నీతి మార్గంలో నడిచి
అందమైన దేశాన్ని నిర్మిద్దాం, జైశ్రీరామ్
శ్రీ రామనవమి శుభాకాంక్షలు
11. శ్రీ రామనవమి మీకు మీ కుటుంబానికి
ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు తీసుకురావాలని
మీ జీవితంలో మీరు కోరుకున్న విధంగా
అన్ని సంపదలు దక్కాలని కోరుకుంటున్నాను
మీకు మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
12. రాముడు మీకు సుఖం శాంతి శ్రేయస్సు
మంచి ఆరోగ్యం సంపాదన ప్రసాదించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీకు మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
13. మీ జీవితంలోని ప్రతిరోజూ
ప్రకాశవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
హృదయపూర్వక శుభాకాంక్షలు
జైశ్రీరామ్
14. సంతోషకరమైన, సంపూర్ణమైన
రామనవమికి హృదయపూర్వక శుభాకాంక్షలు
ఈ పండుగ నుంచి మీ జీవితం, సానుకూలత,
శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నాను
జైశ్రీరామ్
15. శ్రీరామనవమి సందర్భంగా
శ్రీరాముడు మీకు విజయం ఆనందం శాంతిని
ప్రసాదించాలని ఆశిస్తున్నాను
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
16. రాముని ఆశీస్సులు
మీ అన్ని ప్రయత్నాలలో ఉండాలని
మీరు విజయం సాధించడానికి
మార్గ నిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను
మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
17. శ్రీరాముని అనుగ్రహం
మీకు నిరంతరం ఉండాలని కోరుకుంటూ
శ్రీరామనవమి శుభాకాంక్షలు
18. శ్రీరామనవమి అనేది చెడుపై మంచి గెలుపుకు
చీకటిపై వెలుగు సాధించిన విజయానికి
నిర్వహించుకునే వేడుక.
మీ జీవితం వెలుగు, ఆనందం, శ్రేయస్సు
లెక్కలేనని విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
హ్యాపీ శ్రీరామనవమి
19. ఈ శ్రీరామనవమి నుంచి
మీ కలలన్నీ నిజమవ్వాలని
మీ అన్ని ప్రయత్నాలలో విజయం దక్కాలని
కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు
20. చెడుపై మంచి గెలుస్తుందని
శ్రీరామనవమి పండుగ మనకు గుర్తు చేస్తుంది
ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలు
21. శ్రీరాముని ఆశీస్సులతో
మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నీ
విజయవంతం కావాలని కోరుకుంటున్నాను
మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
22. శ్రీరామ కీర్తనల ప్రతిధ్వనులు
మీ జీవితాన్ని ఆనందం సంతృప్తితో నిండనివ్వండి
మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
23. శక్తి , సంకల్పం, సత్యం, నిబద్ధం
వీటన్నింటినీ శ్రీరాముడు నుండి
మనం నేర్చుకోవాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలు
సంబంధిత కథనం