Best Web Hosting Provider In India 2024
TG TTC Coaching 2025: టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం – ఈ లింక్ తో అప్లయ్ చేసుకోండి
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) వేసవి శిక్షణ కోర్సుపై ప్రకటన విడదలైంది. రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి జూన్ 11 వరకు ఈ శిక్షణ ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5 జిల్లాల్లో ఈ శిక్షణ ఉంటుంది.

టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ (టీటీసీ) వేసవి ట్రైనింగ్ కోర్సులకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన జారీ చేసింది.మే 1వ తేదీ నుంచి జూన్ 11 వరకు ఈ శిక్షణ ఉండనుంది.హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఈ కోర్సు అందుబాటులో ఉండనుంది.
ఏప్రిల్ 29 చివరి తేదీ….
ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 29వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. మే 1వ తేదీ నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన వారు 45 ఏళ్లలోపు వయస్సు గల వారు మాత్రమే అర్హులవుతారు.
సాంకేతిక అర్హతకు సంబంధించి టెక్నికల్, లోయర్ గ్రేడ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, ఐటీఐలో జారీ చేసిన నేషనల్ ట్రేడ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ వీవింగ్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ సర్టిఫికేట్లు, తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన కర్నాటక సంగీతంలో గాత్రం సర్టిఫికెట్లలో ఏదో ఒకటి కలిగి ఉండాలి.
టాపిక్