


Best Web Hosting Provider In India 2024
Mental Motivation: మనసు సంతోషంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మానసికంగా దృఢంగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకోండి!
Motivation For strong Mental Health: శారీరక ఆరోగ్యం గురించి చాలా మాట్లాడుతారు, కానీ మనసిక విషయానికొస్తే మాత్రం పెద్దగా పట్టించుకోరు. వాస్తవమేంటంటే శరీరం, మనసు రెండూ ఒకదానికితో ఒకటి ముడిపడి ఉంటాయి. మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో తెలుసుకోండి.
పెరుగుతున్న వయసు మనలో వ్యాధుల భయాన్ని కూడా పెంచుతుంది. మనల్ని మన శారీరక ఆరోగ్యం గురించి ఆలోచించమని బలవంతం చేస్తుంది. కానీ, మానసిక ఆరోగ్యం గురించి మాత్రం పెద్దగా ఆలోచించదు. నిజానికి శారీరక ఆరోగ్యం ఎంతవరకు మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? మానసిక ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ.
ప్రముఖ మనోవైద్య నిపుణులు డాక్టర్ స్మితా శ్రీవాస్త్వ చెబుతున్న విషయం ఏమిటంటే, చాలా సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె కొట్టుకునే వేగం పెరగడం, కండరాలలో ఉద్రిక్తత, అలసట, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు వంటి లక్షణాలు ఆందోళన, ఒత్తిడి వల్లనే వస్తాయి. ముఖ్యంగా భారతదేశంలోని మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గణాంకాలు చెబుతున్న విషయం ఏమిటంటే, ప్రతి పది మందిలో ఆరుగురు మహిళలు తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి నిరాశకు గురవుతారు.
అంతేకాదు, సర్వేలు చెబుతున్న విషయం ఏమిటంటే, 77% మంది భారతీయులు క్రమం తప్పకుండా ఒత్తిడికి సంబంధించి కనీసం ఒక లక్షణాన్ని కలిగి ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, 3.8 కోట్ల మంది భారతీయులు మానసిక చిరాకుకు గురవుతున్నారు. దీని లక్షణాలు శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి నిద్రలేమి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, అధిక ఆందోళన, వికారం, అననుకూల సంఘటనల భయం వంటి సమస్యలకు దారితీస్తున్నాయి. కాబట్టి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానసికంగా బలంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మానసికంగా బలంగా తయారవాలంటే ఏం చేయాలి?
1. మెరుగైన అనుభూతిని పొందండి
ఒత్తిడి, చిరాకు, నిరాశ, ఆసక్తి లేకపోవడం వంటివన్నీ మీరు ఎప్పుడు అనుభవిస్తారు? మీరు సానుకూలంగా, అర్థవంతంగా అనుభూతి చెందనప్పుడే కదా. కాబట్టి మీకు మంచి అనుభూతిని కలిగించే పనుల్లోనే, అంటే మీకు నచ్చేవి, మీకు ఉపయోగపడే పనుల్లో మాత్రమే నిమగ్నమవ్వండి. మనకు నచ్చిన పని చేసినప్పుడు, మన శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది, దీన్ని మనం గుడ్ హార్మోన్ అని కూడా అంటాము. ఇలా చేయడం ద్వారా మీరు సంతోషంగా ఉండటానికి, మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అడుగులు వేయగలరు.
2. వ్యాయామం చేయండి
అధ్యయనాలు చెబుతున్న విషయం ఏమిటంటే, వ్యాయామం మీ మెదడును అలసటకు గురవకుండా చేస్తుంది. ఎక్కువ నిరోధకతను కలిగిస్తుంది. కాబట్టి మీ రోజువారీ కార్యక్రమంలో వ్యాయామానికి స్థానం ఇవ్వండి. రోజులో కాస్త సమయమైనా యోగా, ప్రాణాయామం, వ్యాయామం వంటి మీకు నచ్చిన పనులను చేయండి. రోజంతా సమయం లేకపోతే రాత్రి పడుకునే ముందు కూడా కొన్ని రకాల వ్యాయామాలు, ఆసనాలను వేయచ్చు. ధ్యానం చేయచ్చు. మీ నమ్మకాలకు అనుగుణంగా జపం చేయచ్చు. మనసుకు శాంతి కలిగించే శవాసనాన్ని వేయచ్చు.ఇది అయితే చాలా సులువుగా చేయచ్చు కూడా.
3. బాధ్యతల భారాన్ని తగ్గించుకోండి
మనం రోజంతా చాలా పనులు చేస్తుంటాం. మొత్తం వారమంతా పనుల మీదే పరుగెత్తుతాము. ఖాళీ సమయాల్లో కూడా ఇంటర్నెట్ లేదా ఇతర పనుల్లో నిమగ్నమై ఉంటాము. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. కొన్ని పనులను ఆలస్యం చేసైనా సరే.. మనం కొంత విశ్రాంతి తీసుకోవాలి. వారం పాటు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకునేటప్పుడు మన విశ్రాంతి కోసం, మనం ఆనందం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక అలసట తగ్గుతుంది. మనసు దఢంగా మారుతుంది.
4. స్క్రీన్ నుండి దూరంగా ఉండండి
గణాంకాలు చెబుతున్న విషయం ఏమిటంటే, జెనెరేషన్ జెడ్ వాళ్లు ప్రతిరోజూ సగటున 45 నిమిషాలు ఇన్‌స్టాగ్రామ్‌లో గడుపుతున్నారు. ఇది వారానికి 6 గంటలతో సమానం. వివిధ పరిశోధనలు.. సోషల్ మీడియా ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిర్ధారిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకూ స్క్రీన్ కు దూరంగా ఉండండి. ముఖ్యంగా రాత్రిపూట ఫోన్ లేదా టీవీల నుండి దూరంగా ఉండటం మంచిది. నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే, మెలటోనిన్ హార్మోన్ నిద్రకు కారణమవుతుంది, ఇది చీకటిలోనే విడుదల అవుతుంది. కళ్ళపై కాంతి పడటం వల్ల దీని విడుదల తగ్గుతుంది, ఫలితంగా నిద్ర తగ్గుతుంది. నిద్రలేమితో ఎన్నో రకాల మానసిక సమస్యలు తలెత్తుతాయి.
సంబంధిత కథనం