Work Life Balance : వర్క్​- లైఫ్​ బ్యాలెన్స్​ సాధ్యం కావడం లేదా? హార్వర్డ్​ చెప్పిన ఈ టిప్స్​ పాటించండి..

Best Web Hosting Provider In India 2024


Work Life Balance : వర్క్​- లైఫ్​ బ్యాలెన్స్​ సాధ్యం కావడం లేదా? హార్వర్డ్​ చెప్పిన ఈ టిప్స్​ పాటించండి..

Sharath Chitturi HT Telugu
Published Apr 06, 2025 05:39 AM IST

Work Life Balance : వర్క్​- లైఫ్​ బ్యాలెన్స్​ అసాధ్యంగా మారిందా? ఒత్తిడిలో కూరుకుపోతున్నారా? అయితే వర్క్​ లైఫ్​ బ్యాలెన్స్​ని సాధించేందుకు హార్వర్డ్​ యూనివర్సిటీ సూచించిన ఈ స్టెప్స్​ని ఫాలో అవ్వండి చాలు..

ఇలా చేస్తే వర్క్​ లైఫ్​ బ్యాలెన్స్​ అవుతుంది!
ఇలా చేస్తే వర్క్​ లైఫ్​ బ్యాలెన్స్​ అవుతుంది!

నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో లాగిన్​ అవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటోంది! ఎప్పుడు లాగౌట్​ అవుతామో ఎవరికీ తెలియదు అన్నట్టు ఉంది పరిస్థితి. మరీ ముఖ్యంగా సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగం వల్ల చాలా మంది వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వర్క్​-లైఫ్​ బ్యాలెన్స్​పై చర్చ ఊపందుకుంది. ఏం చేసినా, మన ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. అందుకే, నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో వర్క్​- లైఫ్​ బ్యాలెన్స్​ కనుగొనడానికి తహతహలాడే వ్యక్తుల కోసం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం 5 స్టెప్స్​ని సూచించింది. వాటిని ఇక్కడ చూసేయండి..

వర్క్​-లైఫ్​ బ్యాలెన్స్​ కోసం ఇవి పాటించండి..

1. పాస్​ అండ్​ డీ-నార్మలైజ్​: విరామం తీసుకోండి. ప్రతిరోజూ ఎక్కువ గంటలు పని చేసే చక్రాన్ని విచ్ఛిన్నం చేసి, దాన్ని తగ్గించండి. మీ పని తీరు, పనిగంటలు, ఒత్తిడి స్థాయి, ఇతర కారకాల గురించి ఎనలైజ్​ చేయండి. విశ్లేషించండి. ప్రస్తుతం మీకు ఒత్తిడి, అసమతుల్యత లేదా అసంతృప్తికి కారణమేమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. “ఈ పరిస్థితులు నేను నా ఉద్యోగంలో ఎలా పనిచేస్తాను? ఎలా నిమగ్నం అవుతాను? అవి నా వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను? నేనేం ఏం త్యాగం చేస్తున్నాను? ఏం కోల్పోతున్నాను?” అని ప్రశ్నించుకోండి.

2. మీ భావోద్వేగాలపై శ్రద్ధ వహించండి: మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు గ్రహించిన తర్వాత, దానికి సంబంధించిన మీ భావోద్వేగాలను మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేసే పని మీ జీవితం, రోజుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందా? లేదా? ఇది మీ జీవితంలో ప్రతికూలతకు దారితీస్తుందా? చెక్​ చేయండి. మీ జీవితాన్ని నడిపించే నిర్ణయాలు- ప్రాధాన్యతలపై హేతుబద్ధమైన అవగాహన చాలా ముఖ్యం, కానీ ఎమోషనల్​ రెస్పాన్స్​ కూడా అంతే కీలకం- ఒక పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుందో గుర్తించడం.

3. రీ-ప్రయారటైజ్​: మీ జీవితంలోని విషయాలను విశ్లేషించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ స్టెప్​ ఉపయోగపడుతుంది. మీరు మీ కుటుంబం కంటే మీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, మీరు దానిని చేయవచ్చు లేదా దానికి విరుద్ధంగా చేయవచ్చు. ప్రాధాన్యతలు కాలక్రమేణా మారుతాయి. మీ జీవితంలో ఆ సమయంలో ముఖ్యమైన వాటిని అంగీకరించడం సులభం చేస్తుంది. మీ సానుకూల వర్క్​ లైఫ్​ బ్యాలెన్స్​ మీ నిజమైన ప్రాధాన్యతలకు అనుగుణంగా మీరు మీ సమయాన్ని ఎలా గడుపుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

4. మీ ప్రత్యామ్నాయాలను పరిగణించండి: వర్క్​- లైఫ్​ బ్యాలెన్స్​ చేయడంలో మీకు సహాయపడటానికి ఇతర ఎంపికల కోసం శోధించండి. పరిష్కారాల్లోకి దూకడానికి ముందు, మీ ప్రాధాన్యతలను బాగా అడ్జెస్ట్​ చేయడానికి భిన్నంగా ఉండగల మీ పని- జీవిత అంశాలను చెక్​ చేయండి. మీరు దీన్ని గుర్తించిన తర్వాత, మీరు ప్రత్యామ్నాయాలపై పనిచేయాలి.

5. మార్పులను అమలు చేయండి: మీరు మీ ప్రాధాన్యతలను గుర్తించి, మీరు మెరుగుపరచగల ఆప్షన్స్​ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, వాటిపై పని చేసి, మార్పులు చేసి, తర్వాత ఆ మార్పులను అమలు చేయడం- అమలు చేయడం చివరి దశ. మార్పులు పనిలో లేదా మీ జీవితంలో ఉండవచ్చు. ఓవర్ వర్క్​కు నో చెప్పడం కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడంలో భాగమే అని గుర్తుపెట్టుకోండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link