




Best Web Hosting Provider In India 2024

OTT Telugu Comedy: ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ తెలుగు కామెడీ డ్రామా మూవీ.. 9 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!
Muthayya OTT Streaming: ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ తెలుగు కామెడీ డ్రామా చిత్రం ముత్తయ్య స్ట్రీమింగ్ కానుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 9 రేటింగ్ సొంతం చేసుకున్న ముత్తయ్య ఇండిక్ ఫిల్మ్ ఉత్సవ్ 2022లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ అవార్డ్ అందుకుంది. అలాంటి ముత్తయ్య ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

Muthayya OTT Release: అవార్డు విన్నింగ్ మూవీ ముత్తయ్య ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. 2022లో తెలుగులో కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ముత్తయ్య ఓటీటీ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. సినిమాల్లో నటించాలనే కలగనే 70 ఏళ్లు వృద్ధుడి కథను తెరపై హృద్యంగా ఆవిష్కరించిందీ సినిమా.
ఎన్నో అడ్డకుంలు
తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు అధిగమించిన ముత్తయ్య జర్నీ ఎంతో స్పూర్తిని పంచుతుంది. ముత్తయ్య సినిమాకు డైరెక్టర్ భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
బలగం, బాపు చిత్రాలతో
దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. బలగం, బాపు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె. సుధాకర్ రెడ్డి ముత్తయ్య పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయనతోపాటు ముత్తయ్య సినిమాలో అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ముత్తయ్యకు అవార్డ్స్
కామెడీ డ్రామాగా తెరకెక్కిన ముత్తయ్య సినిమా లండన్‌లోని యుకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది. 28వ కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ లాంగ్వేజెస్ కేటగిరీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, దుబాయ్‌లోని మెటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ తొలి దర్శకుడు, ఇండిక్ చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ అవార్డులను గెలుచుకుంది.
ముత్తయ్య రేటింగ్
ఇది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ (కెనడా), హ్యాబిటాట్ ఫిల్మ్ ఫెస్టివల్ (న్యూ ఢిల్లీ) ఇండియా, ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ అల్బెర్టా (కెనడా), థర్డ్ యాక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ (కెనడా), సినిమాకింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బంగ్లాదేశ్), ఇస్చియా గ్లోబల్ ఫెస్టివల్ (ఇటలీ) లలో కూడా ప్రదర్శించబడింది. ఇలా పలు అవార్డ్స్, ప్రశంసలు అందుకున్న ముత్తయ్యకు ఐఎమ్‌డీబీ నుంచి 10కి ఏకంగా 9 రేటింగ్ సొంతం చేసుకుంది.
ముత్తయ్య ఓటీటీ స్ట్రీమింగ్
ఇలాంటి ముత్తయ్య ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈటీవీ విన్‌లో ముత్తయ్య ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, త్వరలో ముత్తయ్య ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు ప్లాట్‌ఫామ్ నిర్వాహకులు ప్రకటించారు. కానీ, ఇంకా ముత్తయ్య ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను వెల్లడించలేదు. ఈటీవీ విన్‌లో ముత్తయ్య ఓటీటీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ భాస్కర్ మౌర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ కామెంట్స్
దర్శకుడు భాస్కర్ మౌర్య మాట్లాడుతూ.. “ఈటీవీ విన్ ద్వారా ముత్తయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. నా మొదటి సినిమా ముత్తయ్య అనేక చలన చిత్రోత్సవాలలో గొప్ప గుర్తింపు పొందినందుకు ఆనందంగా ఉంది. పలు అవార్డ్స్ మా మూవీకి దక్కాయి. ప్రేక్షకులు ముత్తయ్య సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది. కె సుధాకర్ రెడ్డి, కొత్త నటుడు అరుణ్ రాజ్ అద్భుతంగా నటించారు” అని తెలిపారు.
ఎన్నో క్లాసిక్ మూవీస్
నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఈటీవీ విన్ రీసెంట్‌గా ఎన్నో క్లాసిక్ మూవీస్ స్ట్రీమింగ్ చేసింది. ఈ వేసవి చివరలో ముత్తయ్య ఈటీవీ విన్‌లో ప్రీమియర్ కానుండటం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.
సంబంధిత కథనం