OTT Horror: దెయ్యాలను వెంటాడే చచ్చినోడి కథ.. ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 7.3 రేటింగ్!

Best Web Hosting Provider In India 2024

OTT Horror: దెయ్యాలను వెంటాడే చచ్చినోడి కథ.. ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 7.3 రేటింగ్!

Sanjiv Kumar HT Telugu
Published Apr 06, 2025 08:42 AM IST

The Bondsman OTT Streaming: ఓటీటీలోకి హారర్ యాక్షన్ థ్రిల్లర్ ది బాండ్స్‌మ్యాన్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. చనిపోయిన ఓ వ్యక్తి బతికొచ్చి దెయ్యాలను వెంటాడే నేపథ్యంతో ఈ ది బాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్ సాగుతుంది. ఐఎమ్‌డీబీ నుంచి 7.3 రేటింగ్ సాధించిన ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ చూద్దాం.

దెయ్యాలను వెంటాడే చచ్చినోడి కథ.. ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 7.3 రేటింగ్!
దెయ్యాలను వెంటాడే చచ్చినోడి కథ.. ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 7.3 రేటింగ్!

The Bondsman OTT Release: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉన్నాయి. వాటిలో ఎక్కువగా హారర్ థ్రిల్లర్స్‌ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి. వీటికి ఇతర జోనర్ అంశాలను యాడ్ చేసి మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్‌గా హారర్ యాక్షన్ జోనర్‌లో ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

హాలోమ్యాన్ మూవీతో క్రేజ్

ఆ సిరీసే ది బాండ్స్‌మ్యాన్. అమెరికన్ యాక్షన్ హారర్ జోనర్‌లో తెరకెక్కిన ది బాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్‌‌కు గ్రెంగర్ డేవిడ్ దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు పాట్ ఓ గోల్డ్‌కు కథ అందించారు. ఇక ది బాండ్స్‌మ్యాన్ సిరీస్‌లో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కెవిన్ బాకన్ మెయిన్ లీడ్ రోల్ చేశారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ హాలోమ్యాన్ మూవీతో కెవిన్ బాకన్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో తెలిసిందే.

హలోమ్యాన్, ట్రేమర్స్, ఎక్స్ మెన్ ఫస్ట్ క్లాస్, స్లీపర్స్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కెవిన్ బాకన్. కొంచెం గ్యాప్ తర్వాత కెవిన్ బాకన్ నటించిన హారర్ యాక్షన్ థ్రిల్లరే ది బాండ్స్‌మ్యాన్. ఆయనతో పాటు ఈ వెబ్ సిరీస్‌లో జెన్నిఫర్ నెటిల్స్, బెత్ గ్రాంట్, మ్యాక్స్‌వెల్ జెంకిన్స్, జొలెనె పూర్డీ, డామన్ హెర్రిమన్, స్టాన్ ఎగి, రెన్ హనామీ ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్

ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీలోకి రీసెంట్‌గానే వచ్చేసింది. ఇండియాలో ఏప్రిల్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు భాషలో ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు, ఇంగ్లీష్‌తో కలిపి మొత్తంగా 8 భాషల్లో ది బాండ్స్‌మ్యన్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి 7.3 రేటింగ్ సాధించిన ది బాండ్స్‌మ్యాన్ సిరీస్‌ను సుమారు 30 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌తో తెరకెక్కించారు.

హబ్ హాలోరన్ అనే పాత్ర పోషించిన కెవిన్ బాకన్ ది బాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్‌లో బాంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. టార్గెట్ వచ్చిన కిల్లర్స్‌ను హబ్ చంపుతుంటాడు. ఈ క్రమంలో ఓసారి అనుకోకుండా హబ్ హాలోరన్‌నే ఒకరు గొంతు కోసి చంపేస్తారు. అక్కడికక్కడే బాంటీ హంటర్ హబ్ చనిపోతాడు. కానీ, కొంత సమయానికి తిరిగి బతుకుతాడు. చచ్చాడనుకున్న హబ్ బతికి వచ్చేసరికి తన టీమ్ ఆశ్చర్యపోతుంది.

ఇక్కడే ట్విస్ట్

ఆ తర్వాత మళ్లీ తన వర్క్ మొదలుపెట్టాలని హబ్ అనుకుంటాడు. దాంతో తనకు కిల్లర్స్‌ను టార్గెట్‌గా ఇస్తారు. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. హబ్ చచ్చి బతికి వచ్చేసరికి ఆ సిటీలో దెయ్యాలు తిరుగుతుంటాయి. ఇప్పుడు హబ్ హాలోరన్ పని ఆ దెయ్యాలను వెంటాడి చంపడమే.

మరి దెయ్యాలను చంపే బాంటీ హంటర్ హబ్‌కు ఎదురైన సవాళ్లు ఏంటీ?, అతను ఎలా తిరిగి బతికాడు? ఆ దెయ్యాల గోల ఏంటీ? అవి ఎలా వచ్చాయి? ఆ దెయ్యాలకు హబ్ హాలోరన్‌కు సంబంధం ఏంటీ? అనేదే ది బాండ్స్‌మ్యాన్ కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ది బాండ్స్‌మ్యాన్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు భాషలో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024