




Best Web Hosting Provider In India 2024

Naveen Chandra: అందాల రాక్షసి ఎఫెక్ట్ చాలా ఉండేది.. విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టం.. హీరో నవీన్ చంద్ర కామెంట్స్
Naveen Chandra About 28 Degree Celsius Movie: హీరో నవీన్ చంద్ర నటించిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ 28 డిగ్రీ సెల్సియస్. రీసెంట్‌గా ఏప్రిల్ 4న థియేటర్లలో 28 డిగ్రీ సెల్సియస్ మూవీ రిలీజ్ అయింది. అయితే, దీనికంటే ముందుగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో నవీన్ చంద్ర మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Naveen Chandra About 28 Degree Celsius Movie: తెలుగుతో పాటు తమిళంలో పలు హిట్ మూవీస్, వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నవీన్ చంద్ర. లేటెస్ట్‌గా నవీన్ చంద్ర హీరోగా నటించిన కొత్త తెలుగు సినిమా “28°C”. ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు.
మంచి రెస్పాన్స్
28 డిగ్రీ సెల్సియస్ సినిమాకు “పొలిమేర” ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ వహించారు. ఈ చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పైయంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మించారు. నవీన్ చంద్రకు జోడీగా షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా నటించింది. అయితే, ఏప్రిల్ 4న థియేటర్లలో 28 డిగ్రీ సెల్సియస్ రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
అయితే, 28 డిగ్రీ సెల్సియస్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందు పలు ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో నవీన్ చంద్ర పాల్గొన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 28 డిగ్రీ సెల్సియస్ మూవీ విశేషాలు, వర్రింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు హీరో నవీన్ చంద్ర.
ఆరేళ్ల కిందట స్టార్ట్
– ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయింది. ఒకరోజు రెస్టారెంట్‌లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్‌గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్‌లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతుంది.
– వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికీ నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్‌లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. ఇక “28°C” సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.
రెండుసార్లు వెనక్కి వచ్చాం
– 28 డిగ్రీ సెల్సియస్ సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం. కానీ, ఆ టైమ్‌లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్‌గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.
– మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్‌గా సెటిల్ అవుతారు.
28 డిగ్రీ టెంపరేచర్‌లోనే
– అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్‌లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్‌గా మలిచారు మా డైరెక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్‌గా రాశారు.
సంబంధిత కథనం