అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే మగవారు భయపడతారట, ఇది నిజమో కాదో మీరే చెప్పండి అబ్బాయిలు

Best Web Hosting Provider In India 2024

అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే మగవారు భయపడతారట, ఇది నిజమో కాదో మీరే చెప్పండి అబ్బాయిలు

Haritha Chappa HT Telugu
Published Apr 06, 2025 09:30 AM IST

వివాహం కోసం సంబంధాలు చూసేటప్పుడు లేదా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆమెను పెళ్లి చేసుకోమని అడగడానికి అబ్బాయిలు చాలా భయపడతారట. దానికి కారణం ఏంటో తెలుసుకోండి.

అబ్బాయిలు అందమైన అమ్మాయిల గురించి ఇలానే అనుకుంటారు
అబ్బాయిలు అందమైన అమ్మాయిల గురించి ఇలానే అనుకుంటారు (Pixabay)

అందమైన అమ్మాయిలను చూడగానే అబ్బాయిల మనసు మంచులా కరిగిపోతుంది. కానీ ఆ అమ్మాయిని వివాహం చేసుకోమని అడగడానికి మాత్రం అబ్బాయిలు చాలా భయపడతారు. ఆమె ఆలోచనలోనే మునిగిపోతారు. కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన భావాలను వ్యక్తపరచడానికి మాత్రం ముందుకు అడుగయ్యరు. దాని వెనుక కారణం ఏంటో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

ఆత్మవిశ్వాసం లేక

అమ్మాయిలు చూడగానే ఆకట్టుకునేలా ఉంటారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో అందం ఎక్కువ. అది స్వతహాగా పుట్టుకతోనే వస్తుంది. అయితే అబ్బాయిలు అందమైన అమ్మాయి ముందుకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడగడానికి ఎంతో సంకోచిస్తారు. అలాంటి అమ్మాయికి తాము అర్హులం కాదని భావిస్తారు. అందమైన అమ్మాయికి ధనవంతుడు, పెద్ద ఉద్యోగం ఉన్నవాడు వస్తాడని అనుకుంటూ ఉంటారు. తమలో ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే ఇలాంటి ఆలోచనలు చేస్తారు. ఆ అమ్మాయికి జీవితాంతం తన ప్రేమికుడిలా ఉండిపోతారు.

తిరస్కరిస్తుందన్న భయం

అందం అనేది చాలా ప్రముఖమైనదిగా మారిపోయింది. అందమైన అమ్మాయిలకు రోజుకు ఒకరు ప్రపోజ్ చేసే రోజులు ఇవి. కాబట్టి తాము ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి తిరస్కరిస్తుందని ఎంతోమంది అబ్బాయిలు అనుకుంటారు. ఆ తిరస్కరణ భయం మగవారిలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వారు వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. ఆమెను దూరం నుంచే చూసి ఆరాధిస్తారు. కానీ పెళ్లి ప్రపోజల్ మాత్రం పెట్టరు.

బాయ్ ఫ్రెండ్ ఉంటాడనుకుని

అందమైన అమ్మాయి కనబడగానే అబ్బాయిలు మొదట భావించేది ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ లేదా లవర్ ఉంటాడని అనుకోవడం. లేకుంటే ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఎవరు వదులుతారు అనుకుంటూ తమలో తామే ఎన్నో రకాల ఆలోచనలు చేస్తారు. అమ్మాయికి పెళ్లి ప్రపోజల్ లేదా ప్రేమ ప్రపోజల్ పెట్టకుండానే ఆమెకు లవర్ ఉండే ఉంటాడని… ఆమె వైపు వెళ్లకుండా ఉంటేనే మంచిదని ఆగిపోతారు. కనీసం మనసులో మాట చెప్పేందుకు కూడా అడుగు ముందుకు వేయరు. అందుకే ఎంతమంది అబ్బాయిలు ప్రేమలో విఫలమవుతూ ఉంటారు.

పొగరు ఎక్కువ అనుకుని

అందంగా ఉండే అమ్మాయిలకు పొగరు ఎక్కువ ఉంటుందని, వారిని భరించడం చాలా కష్టమని కూడా కొంతమంది అబ్బాయిలు భావిస్తూ ఉంటారు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా భావిస్తారు. అందుకే అందంగా ఉండే అమ్మాయిలను కళ్ళతోనే చూసి ఆరాధిస్తారు. కానీ వారిని తమ జీవితంలో ఆహ్వానించేందుకు ప్రయత్నించరు. నిజానికి అందంగా ఉన్న అమ్మాయిలు కూడా ఎంతోమంది తమ భాగస్వామి అంచనాలకు తగ్గట్టు తక్కువలో జీవించేవారు కూడా ఉన్నారు. కానీ వారి అందమే అబ్బాయిల్లో భయానికి కారణం అవుతుంది.

అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు లేదా పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ఆమె గొడవ చేస్తుందేమో అన్న భయం కూడా అబ్బాయిల్లో ఉంటుంది. దీని వల్ల స్నేహితులు, కుటుంబం, సమాజం దృష్టిలో తను చెడ్డవాడిగా ముద్రపడతానని భావిస్తాడు. అలాగే పరువు పోయే అవకాశం ఉంటుందని కూడా అనుకుంటాడు. దీనివల్లే అందంగా ఉన్న అమ్మాయిని దూరం నుంచే చూస్తాడు. కానీ ఆమెను తన జీవితంలో ఉంచుకోవాలని మాత్రం భావించడు.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024