




Best Web Hosting Provider In India 2024

Baba Ramdev Diabetes Treatment: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి రామ్ దేవ్ బాబా చెప్పిన 5 సూత్రాలు!
Ways To Control Diabetes: అధిక ఒత్తిడి, పేలవమైన జీవనశైలి కారణంగా చాలా మంది మధుమేహాంతో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు బాబా రాందేవ్ 5 చిట్కాలను సూచిస్తున్నారు. ఆయన ప్రకారం.. ఎటువంటి మెడిసిన్ అవసరం లేకుండా షుగర్ కంట్రోల్ చేయాలనుకుంటే ఈ టెక్నిక్స్ పాటించండి.

ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఇబ్బందిపెట్టే సమస్యగా మారింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరిలో షుగర్ వ్యాధి కనిపిస్తుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి కారణంగా గతం కంటే ఎక్కువగా యువతలో కూడా ఈ వ్యాధి ప్రమాదం పెరిగింది. అందరికీ ఉంటుంది కదా అని సాధారణ సమస్య అని కొట్టిపారేయడానికి లేదు. ఇది చాలా ప్రమాదకరమైనది వ్యాధి. సరైన సమయంలో గుర్తించి షుగర్ స్థాయిలను అదుపులో ఉంచకపోతే ఇది మూత్రపిండాలు, గుండె, రక్తపోటు లేదా కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుంది.
బాబా రామ్‌దేవ్ ఈ సమస్య మూలం నుండి తొలగించడానికి, పాత షుగర్‌ను సాధారణం చేయడానికి అనేక చిట్కాలను పంచుకుంటున్నారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఆయన చెప్పిన 5 చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూసేద్దామా..
1) త్రిఫల చూర్ణంతో మెరుగైన ప్రయోజనాలు
త్రిఫల చూర్ణం అనేది అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో చేసిన పొడి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
2) కలబందను మజ్జిగతో కలిపి తీసుకోవడం
మజ్జిగతో కలిపి కలబంద తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయికి వస్తుంది. దీన్ని తీసుకోవడానికి కలబంద ముక్కలను కట్ చేసి, దాని గుజ్జును మజ్జిగతో కలిపి త్రాగాలి.
3) యోగా సహాయపడుతుంది
డయాబెటిస్ నుండి బయటపడటానికి బాబా రామ్‌దేవ్ ప్రతిరోజూ కపాలభాతి, అనులోమ-విలోమ, భస్త్రిక, భ్రమరి, ఉద్గీత, ఉజ్జాయి వంటి ప్రాణాయామాలు చేయాలని సూచిస్తున్నారు. ఈ యోగాసనాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.
4) తేనెలో కలిపి ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం:
చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి, ఒక చెంచా ఉల్లిపాయ రసం, నిమ్మరసం, అల్లం రసం, వెల్లుల్లి రసం తీసుకొని, బాగా ఉడికించి చిక్కగా తయారు చేయాలి. ఆ తర్వాత అందులో సమాన మోతాదులో తేనె కలపాలి. దానిని ప్రతిరోజూ ఒక చెంచా మోతాదుగా త్రాగుతూ ఉండాలి. ఇది తాగుతుండటం వల్ల కేవలం డయాబెటిస్‌యే కాదు. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది.
5) నేరేడు – దోసకాయ – టమాటో జ్యూస్
డయాబెటిస్‌ను ఎదుర్కోవడానికి బాబా రామదేవ్ సూచించిన చిట్కాలలో ఒకటి ఈ జ్యూస్. దీనిని తయారు చేయడానికి ఒక నేరేడు, ఒక దోసకాయ, ఒక టమాటోతో పాటు 10-12 సదాబహార్ పువ్వులు, కొద్దిగా కలబంద, అశ్వగంధ, తులసి, ఆవాల, గిలోయ కలపాలి. వీటన్నిటినీ కలిపి ఒక జ్యూస్ తయారు చేసి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. ఈ తయారీ కోసం మీకు అందుబాటులో అన్ని పదార్థాలు లేకపోతే, మీరు దోసకాయ, నేరేడు, టమాటోలతో మాత్రమే జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగేయొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం