Jaggery for Skin: నోటిని తీపి చేసే బెల్లం రుచికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మంచిదట! ఇదిగోండి 4 ఫేస్ ప్యాక్‌లు

Best Web Hosting Provider In India 2024

Jaggery for Skin: నోటిని తీపి చేసే బెల్లం రుచికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మంచిదట! ఇదిగోండి 4 ఫేస్ ప్యాక్‌లు

Ramya Sri Marka HT Telugu
Published Apr 06, 2025 12:30 PM IST

Jaggery for Skin: చర్మానికి బెల్లంతో ఒకటి కాదు రెండు కాదు బోలెడు ప్రయోజనాలున్నాయట. తినడం వల్ల మాత్రమే కాదు.. చర్మానికి ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా చాలా లాభాలను పొందచ్చట. బెల్లంతో వేసుకునే 4 రకాల ఫేస్ ప్యాక్‌లు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి.

బెల్లంతో చర్మానికి వేసుకునే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం ఎలా
బెల్లంతో చర్మానికి వేసుకునే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం ఎలా (PC: Canva)

షుగర్ రీప్లేస్మెంట్ కోసం మనలో చాలా మంది వాడే పదార్థం బెల్లం. అవును, రుచిలో చక్కెరకు ధీటుగా తియ్యదనం అందించడమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేసే లక్షణాలు ఇందులో ఉంటాయి. ఇలా రుచి కోసం వినియోగించే బెల్లాన్ని చర్మ సౌందర్యం కోసం కూడా ఉపయోగించవచ్చట. ముఖ్యంగా ఈ వేసవిలో సూర్యరశ్మి వల్ల ట్యానింగ్‌కు గురైన చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలన్నా లేదా చర్మంపై మచ్చలు పోవాలన్నా బెల్లం ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడి వయస్సు పెరిగే లక్షణాలను నెమ్మెది అయ్యేలా చేస్తుంది. ఇంకా బెల్లంలో ఉండే సహజమైన తీపి గుణం ప్రత్యేకమైన మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అయిన ఐరన్, కాల్షియం, విటమిన్ సీలతో నిండి ఉంటుంది.

మరి బెల్లం చర్మానికి ఏ రకమైన ప్రయోజనం అందిస్తుందంటే..

చర్మానికి సపోర్ట్ చేసే ఐరన్, కాల్షియం, విటమిన్ సీలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. చర్మారోగ్యాన్ని పెంపొందించడంతో పాటు ఐరన్ సర్క్యూలేషన్ కు తోడ్పడి, కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది కూడా. శరీరాన్ని క్లీన్ చేయడంలో బెల్లం పరోక్షంగా ఉపయోగపడి టాక్సిన్లను తొలగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చర్మ సౌందర్యం కోసం బెల్లాన్ని ఎలా ఉపయోగించాలి?

1. బెల్లం – తేనె కలిపి షేస్ మాస్క్:

కావాల్సిన పదార్థాలు

  • బెల్లం పొడి – 1 టేబుల్ స్పూన్
  • తేనె – 1 టీ స్పూన్
  • పెరుగు – 1 టీ స్పూన్

తయారీ విధానం

  1. బెల్లం, తేనె, పెరుగు కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
  2. ఆ మిశ్రమం ముఖమంతా పట్టేలా రాసుకుని ఒక 15 నిమిషాల పాటు వదిలేయాలి.
  3. ఆ తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.
  4. ఇలా చేయడం వల్ల చర్మానికి హైడ్రేషన్ అందించి, తేనె-పెరుగు రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

2. బెల్లం – శెనగపిండి స్క్రైబ్

కావాల్సిన పదార్థాలు

  • 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి
  • 1 టేబుల్ స్పూన్ శెనగపిండి
  • 1 టీ స్పూన్ నిమ్మరసం

తయారీ విధానం

  1. బెల్లం, శెనగపిండి, నిమ్మరసంలను కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
  2. దీనిని చర్మంపై ఒక ఐదు నిమిషాల పాటు రుద్దుకుంటూ ఉండాలి.
  3. ఈ ఫేస్ మాస్క్ వాడటం వల్ల చర్మంపై మృతకణాలు తొలగిపోవడంతో పాటు, టాన్ పోయి చర్మం కాంతులీనుతుంది.

3. బెల్లం – కలబంద మాస్క్

కావాల్సిన పదార్థాలు

  • బెల్లం పొడి – 1 టేబుల్ స్పూన్
  • కలబంద – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

  1. బెల్లం, కలబంద గుజ్జును కలుపుకోవాలి.
  2. చర్మంపై రాసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.
  3. ఆ తర్వాత ముఖం కడిగేసుకుంటే సరిపోతుంది.
  4. బెల్లం ప్రయోజనాలు అందించే బెస్ట్ టెక్నిక్ ఇది. యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు పెరిగి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

4. తేనె – పసుపులతో బెల్లం

కావాల్సిన పదార్థాలు

  • బెల్లం పొడి – 1 టేబుల్ స్పూన్
  • తేనె – 1 టీస్పూన్
  • పసుపు – 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం – 1 టీస్పూన్

తయారీ విధానం

  1. బెల్లాన్ని వేడి చేయడం లేదా పౌడర గానో ఏదో విధంగా చేసుకోవాలి.
  2. ఇప్పుడు అందులో తేనె, పసుపు, నిమ్మరసంలను కలుపుకుని మెత్తటి పేస్ట్ గా చేసుకోవాలి.
  3. ఈ మాస్క్ ను తరచూ ముఖంపై రాసుకుంటూ ఉండండి. (కంటి కింది భాగంలో మాత్రం రాసుకోవద్దు).
  4. 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయండి.
  5. ఆ తర్వాత కొద్దిపాటి వేడి నీళ్లతో కడిగేసుకుని ఆరనివ్వండి.
  6. మరింత ప్రయోజనకారిగా ఉండటం కోసం తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని చర్మం హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.

ఈ ఫేస్ మాస్క్ సీబమ్ ప్రొడిక్ఆయిలీ స్కిన్, మొటిమలకు గురయ్యే చర్మానికి బాగా పనిచేస్తుంది. పగిలిన చర్మాన్ని బాగు చేయడంతో పాటు డిటాక్సిఫైయింగ్ గా కూడా పనిచేస్తుంది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024