



Best Web Hosting Provider In India 2024

Hyderabad : బెట్టింగ్ యాప్స్‌కు మరో యువకుడు బలి.. రైలు కిందపడి ఆత్మహత్య
Hyderabad : బెట్టింగ్ భూతం మరో యువకుడిని బలి తీసుకుంది. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు తనువు చాలించాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దీని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెట్టింగ్ యాప్స్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పులపాలైన రాజ్వీర్సింగ్ (25) అనే యువకుడు.. సూసైడ్ చేసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే సికింద్రాబాద్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు సుచిత్రలోని బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్లో నివాసం ఉండేవాడు.
ఆత్మహత్యలు పెరిగాయి..
బెట్టింగ్ యాప్‌ల కారణంగా తెలంగాణలో ఈ మధ్యనే 15 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు పెరిగాయని పోలీసులు గుర్తించారు. ఈ యాప్‌ల వలన కలిగే ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యల కారణంగా తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
ఆర్థికంగా చితికిపోతున్నారు..
బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకోవడం వల్ల ఆర్థికంగా చితికిపోతారు. అప్పులు చేసి బెట్టింగ్ ఆడటం వల్ల ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. కొందరు లోన్ యాప్స్ ద్వారా అప్పులు చేసి.. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. బెట్టింగ్ యాప్‌లకు బానిసలవడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. ఓటమి భరించలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యులతో గొడవలు రావడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి.
డబ్బు కోసం నేరాలు..
బెట్టింగ్ యాప్‌ల వల్ల డబ్బులు పోగొట్టుకున్న వారు నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ, ఇతరులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత చెడు మార్గంలో వెళ్తున్నారు. ఇది సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. చాలా బెట్టింగ్ యాప్స్ చట్టవిరుద్ధంగా పనిచేస్తాయి. ఇలాంటి యాప్స్ వాడటం వల్ల చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
దూరమే మేలు..
బెట్టింగ్ యాప్‌లు ప్రమాదకరమైనవని.. వాటికి దూరంగా ఉండటమే మంచిదని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. బెట్టింగ్ వ్యసనానికి గురైతే, వెంటనే సహాయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, నిపుణులతో మాట్లాడాలి. ఆన్‌లైన్ మోసాలను గుర్తించినట్లయితే.. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి డయల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ఉపయోగించేటప్పుడు.. డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో జాగ్రత్త వహించాలని పబ్లిక్ అడ్వైజరీలు సూచిస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్