


Best Web Hosting Provider In India 2024

Milk Storage tips: వేసవిలో పాలు త్వరగా పాడవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
Milk Storage tips: వేసవిలో పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అవి విరిగిపోయే ప్రమాదం ఎక్కువ. పాలను ఫ్రిజ్ లో పెడితేనే రెండు రోజులు నిల్వ ఉంటాయి. పాలు ఫ్రిజ్ లో పెట్టినా, పెట్టక పోయినా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించండి.

వేసవిలో పాలు త్వరగా పాడవుతాయి. ముక్కలుగా విరిగిపోతాయి. దీనివల్ల పాలు ఎక్కువ సార్లు కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇంట్లో పాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ మేము పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
వేసవిలో పాలే కాదు ఏ ఆహారాలైనా తక్కువ కాలమే తాజాగా ఉంటాయి. చిన్నపాటి అజాగ్రత్త వల్ల పాలు కూడా అధికంగా విరిగిపోతాయి. మీ ఇంట్లో వేసవి రాగానే పాలు విరిగిపోవడం మొదలైతే ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి. ఆ పాలను ఫ్రిజ్ లో పెట్టకుండానే ఇవి తాజాగా ఉంటాయి. ఫ్రిజ్ లో పెట్టిన పాలు కూడా వారం రోజుల పాటూ నిల్వ ఉంచే చిట్కాలు ఇవన్నీ.
పాలు స్టోరేజీ టిప్స్
1) వేసవిలో ఏదైనా వండిన వంటకం, పానీయం చెడిపోకుండా ఉండాలంటే పదేపదే వేడి చేయాలి. ప్రతి మూడు నాలుగు గంటలకొకసారి పాలను వేడి చేసి అవి విరిగిపోకుండా చూసుకోవాలి. వేడి పాలను ఎప్పుడూ మూత పెట్టి ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల పాలు త్వరగా చెడిపోతాయి.
2) పాలు మరిగించక ముందు చిటికెడు బేకింగ్ సోడా వేసి మరిగించాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. అలా అని ఎక్కువ బేకింగ్ సోడా జోడించడం మానుకోండి. ఎందుకంటే ఇది పాల రుచిని పాడు చేస్తుంది.
3) మీ ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే, ఫ్రిజ్ పనిచేయకపోయినా ముందుగా పాలను బాగా మరిగించాలి. ఆ తర్వాత పాలను చల్లార్చి పెద్ద పాత్రలో నీళ్లు నింపి ఆ పాలను ఫ్యాన్ కింద ఉంచాలి. ఇది పాలు విరగకుండా నిరోధిస్తుంది.
4) చాలాసార్లు ప్రజలు పాత పాల పాత్రలనే వాడుతుంటారు. ఇది పాలు విరిగిపోవడానికి కారణమవుతుంది. వేసవిలో పాలను శుభ్రమైన పాత్రలో, బాగా ఎండిన పాత్రలో మరిగించాలి. గిన్నె తోమిన సబ్బు అవశేషాలు ఉన్నప్పటికీ పాలు పెరుగుతాయి. కాబట్టి పాత్ర శుభ్రంగా ఉందో లేదో తనిఖీ చేయండి.
5) ప్యాకేజ్డ్ పాలను ఎక్కువ సేపు మరిగించకూడదని, పాశ్చరైజ్డ్ పాలను వేడి చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. తిరిగి వేడి చేయడం వల్ల ఈ పాలలోని పోషకాలు తగ్గుతాయి. నిజానికి వేసవిలో ఎక్కువ మొత్తం ఒకేసారి పాలను కొని మరిగించే బదులు… మీకు అవసరమైనంత వరకే పాలు కొనుక్కుని వాడడం మంచిది.
పాలు వాడకం వేసవి అయినా, చలికాలం అయినా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజూ పెద్దలు టీ తాగుతారు. పిల్లలు పాలు తాగుతారు. కాబట్టి పాలు ఇంట్లో ముఖ్యమైన పానీయం.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం