


Best Web Hosting Provider In India 2024

Arya 2 Re-release Collections: రీ-రిలీజ్‍లో దుమ్మురేపిన ఆర్య 2 సినిమా.. ఫస్ట్ డే ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
Arya 2 Re-release Collections: ఆర్య 2 సినిమా రీ-రిలీజ్‍లో సత్తాచాటింది. తొలి రోజు మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీకి ఉన్న క్రేజ్‍ను నిరూపించింది. ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రం 2009 నవంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వారిద్దరి కాంబినేషన్‍లో రెండో మూవీగా.. ఆర్య ఫ్రాంచైజీలో సెకండ్ సినిమాగా ఆర్య 2 వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్‍బస్టర్ కాలేకపోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నవదీప్ కూడా ప్రధాన పాత్రలు చేశారు. ఆర్య 2 సినిమా ఇప్పుడు సుమారు పదిహేనున్నర ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ-రిలీజై సత్తాచాటుతోంది.
తొలి రోజు కలెక్షన్లు ఇవే
అల్లు అర్జున్ తన 43వ పుట్టిన రోజును ఏప్రిల్ 8న జరుపుకోనునున్నారు. ఈ సందర్భంగా ఇందుకు మూడు రోజుల ముందే ఏప్రిల్ 5వ తేదీన ఆర్య 2 మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. ఈ చిత్రానికి బుకింగ్స్ జోరుగా సాగాయి. రీ-రీలీజ్‍లో ఆర్య 2 సినిమా తొలి రోజు సుమారు రూ.4.02 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
ఆర్య 2 చిత్రం రీ-రిలీజ్‍లో అదిరే ఓపెనింగ్ దక్కించుకుంది. ఏకంగా రూ.4కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. ఈ మూవీకి రెండో రోజైన శనివారం కూడా బుకింగ్స్ బాగానే జరిగాయి. దీంతో మంచి వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు రీ-రిలీజ్ ఫుల్ రన్‍లో ఎంత కలెక్షన్లు వస్తాయో చూడాలి. కాగా, ఆర్య 2 ప్రదర్శితమైన థియేటర్లలో అల్లు అర్జున్ అభిమానులు భారీగా హంగామా చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు.
లవ్, ఫ్రెండ్‍షిప్‍తో..
ఆర్య 2 సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. ఫ్రెండ్‍షిప్ కూడా మెయిన్ పాయింట్‍గా ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు సుకుమార్. అయితే, పాజిటివ్ టాకే వచ్చిన ఈ చిత్రానికి అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లు దక్కలేదు. మోస్తరు హిట్‍గా నిలిచింది. ఈ మూవీ 2009 నవంబర్ 27వ తేదీన విడుదలైంది.
ఆర్య 2 చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ యాక్టింగ్ ఆకట్టుకుంది. లవ్, కామెడీ, ఎమోషన్లతో ఈ చిత్రం మెప్పించింది. ఈ సినిమాలో పాటలు ఏ రేంజ్‍లో పాపులర్ అయ్యాయి. ఈ మూవీకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూజ్ చేశారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‍లో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలో సెన్సేషనల్ హిట్స్ సాధించాయి. పాన్ ఇండియా రేంజ్‍లో బాక్సాఫీస్‍ను షేక్ చేశాయి. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 చిత్రం ఏకంగా రూ.1,800కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. పుష్ప చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‍లో అల్లు అర్జున్‍కు చాలా క్రేజ్ వచ్చేసింది.
అల్లు అర్జున్ తదుపరి తమిళ డైరెక్టర్ అట్లీతో మూవీ చేయనున్నారు. ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న అధికారిక ప్రకటన రానుంది. ఇందుకోసం ఓ స్పెషల్ వీడియో కూడా రానుందని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో మైథలాజికల్ చిత్రం కూడా చేయనున్నారు అల్లు అర్జున్.
సంబంధిత కథనం
టాపిక్