


Best Web Hosting Provider In India 2024

Zee Telugu TV Serials: మూడు టీవీ సీరియళ్ల టైమింగ్స్ ఛేంజ్.. రేపటి నుంచే..
TV Serials: జీ తెలుగులో మరొకసారి సీరియళ్ల టైమింగ్స్ మారాయి. మూడు సీరియళ్ల టెలికాస్ట్ టైమ్స్ ఛేంజ్ అయ్యాయి. ఆ సీరియల్స్ ఏవో, ఇక నుంచి ఏ సమయానికి వస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

జీ తెలుగు టీవీ ఛానెల్‍లో కొంతకాలంగా సీనియల్స్ సమయాల్లో మార్పులు జరుగుతున్నాయి. గత నెలలో కొన్ని సీరియల్స్ టైమ్స్ మారాయి. ఇప్పుడు మరోసారి మూడు సీరియళ్ల టెలికాస్ట్ ప్రసార సమయాలను జీ తెలుగు మారుస్తోంది. రేపటి (ఏప్రిల్ 7) నుంచి మూడు సీరియళ్ల టైమ్ ఛేంజ్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఈ సీరియళ్ల టైమ్స్ మార్పు
జీ తెలుగులో ముక్కుపుడక, సీతే రాముడి కట్నం, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియళ్ల టైమింగ్స్ రేపు ఏప్రిల్ 7 నుంచి మారనున్నాయి. ఇక నుంచి ముక్కుపుడక సీరియల్ మధ్యాహ్నం 12 గంటలకు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కానుంది. ఒంటి గంట నుంచి టైమ్ 12కు ఛేంజ్ అయింది.
సీతే రాముడి కట్నం సీరియల్ ఏప్రిల్ 7 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. ఈ సిరీయల్ కూడా సోమవారం నుంచి శనివారం వరకు వస్తుంది. 12.30 నుంచి ఏకంగా 3 గంటలకు ఈ సీరియల్ మారిపోయింది. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ రేపటి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఓ అర గంటే వెనక్కి వెళ్లింది. గతంలో సాయంత్రం ప్రసారమైన ఈ సీరియల్.. లక్ష్మీ నివాసం రావటంతో మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ 3.30 గంటలకు ఈ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ టైమ్ మారింది.
మరో కొత్త సీరియల్
జీ తెలుగులో రేపు ఏప్రిల్ 7 నుంచి మరో కొత్త సీరియల్ ప్రసారం కానుంది. ‘దీర్ఘ సుమంగళీభవ’ రేపటి నుంచి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటలకు ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రభావంతో ముక్కుపుడక టైమ్ 12 గంటలకు మారింది. మరో రెండు సీరియళ్ల సమయాలను కూడా జీ తెలుగు మార్చింది.
దీర్ఘ సుమంగళీభవ సీరియల్‍లో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఫేమ్ మహి గౌతమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రతాప్, పవన్ రవీంద్ర కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. అహల్య పాత్రలో ఈ సీరియల్‍లో మహి కనిపించనున్నారు.
జీ తెలుగు ఛానెల్‍లో గత నెల మార్చిలో లక్ష్మీ నివాసం సీరియల్ ప్రారంభమైంది. ఆ సీరియల్ సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతోంది. ఈ సీరియల్ రాకతో గత నెలలో నిండు నూరేళ్ల సావాసం సాయంత్రం 6.30 గంటలకు, మా అన్నయ్య 6 గంటలకు మారాయి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఏకంగా మధ్యాహ్నానికి వెళ్లింది.
సంబంధిత కథనం