




Best Web Hosting Provider In India 2024

AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ ఫలితాలు డౌన్లోడ్- ఆన్ లైన్, వాట్సాప్, ఎస్ఎంఎస్ విధానాలివే
AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ ఫలితాలు ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మూల్యాంకనం, ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియ పూర్తైతే ఏప్రిల్ 12 లేదా 13 తేదీల్లో ఫలితాలు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు, వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు.

AP Inter Results 2025 : ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) త్వరలోనే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనుంది. ఇంటర్ ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in, bieap.gov.in లలో అడ్మిట్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. అలాగే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో ఈ ఏడాది నేరుగా విద్యార్థులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
గతేడాది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 2 నుంచి మార్చి 20 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరిగాయి. ఫలితాలు ఏప్రిల్ 12, 2024న విడుదల చేశారు. ఈ సంవత్సరం ఫస్టియర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు, సెకండియర్ పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరిగాయి. గత సంవత్సరం ట్రెండ్‌లను బట్టి ఏప్రిల్ నెలలోనే ఫలితాలను ప్రకటించవచ్చు.
బోర్డు నిర్దేశించిన విధానం ప్రకారం విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి థియరీ, ప్రాక్టికల్ పరీక్షలలో కనీసం 35 శాతం మార్కులు పొందాలి. కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించడంలో విఫలమైన విద్యార్థులకు మరొకసారి ఉత్తీర్ణత సాధించడానికి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలి.
ఏపీ ఇంటర్ 1వ, 2వ సంవత్సరాల ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి?
Step 1: విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ bieap.gov.in పై క్లిక్ చేయాలి.
Step 2: వెబ్‌సైట్ హోమ్‌పేజీ ‘AP IPE ఫలితాలు 2025’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
Step 4: లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
Step 5 : స్క్రీన్ పై ఇంటర్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
ఏపీ ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలు 2025- ఎస్ఎంఎస్ ద్వారా ఎలా చెక్ చేయాలి?
Step 1 : మీ ఫోన్ లో SMS తెరిచి APGEN2 లేదా APGEN1 (స్పేస్) రోల్ నెంబర్‌ను టైప్ చేయండి.
Step 2 : ఆ తర్వాత 5626 కు మెసేజ్ పంపండి
Step 3: మీ ఇంటర్ ఫలితాలను మెసేజ్ గా అందుకుంటారు.
2024లో ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలయ్యాయి. సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 18న ప్రకటించారు. 2023లో ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. 2022, 2021, 2020 సంవత్సరాల్లో వరుసగా జూన్ 22, జులై 23, జూన్ 12న ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలు ఒకే రోజున విడుదల చేయనున్నారని సమాచారం.
ఏపీ ఇంటర్ ఫలితాలు వాట్సాప్ ద్వారా
విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు, మార్కుల మెమోలను WhatsApp ద్వారా పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఏపీ వాట్సాప్ యాప్ నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయండి.
Step 2 : ఆ తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోండి.
Step 3 : ‘డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ ‘హాల్ టికెట్’ నెంబర్‌ను నమోదు చేయండి.
Step 5 : PDF రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.
హెచ్.టి.తెలుగులో కూడా ఇంటర్ ఫలితాలు పొందవచ్చు. విద్యార్థుల తమ సౌలభ్యం మేరకు హెచ్.టి.తెలుగు https://telugu.hindustantimes.com/ వెబ్ సైట్ లో పొందవచ్చు. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్