Mom And Daughter: కూతళ్లను ధైర్యంగా, స్వతంత్రంగా తయారు చేయడంలో తల్లుల పాత్ర ఎంతో గొప్పదట, తల్లిగా మీరు ఏం చేయాలంటే..!

Best Web Hosting Provider In India 2024

Mom And Daughter: కూతళ్లను ధైర్యంగా, స్వతంత్రంగా తయారు చేయడంలో తల్లుల పాత్ర ఎంతో గొప్పదట, తల్లిగా మీరు ఏం చేయాలంటే..!

Ramya Sri Marka HT Telugu
Published Apr 06, 2025 07:30 PM IST

Mom And Daughter: కుమార్తెలను మానసికంగా బలంగా, స్వతంత్రురాలిగా మార్చడంలో తల్లు పాత్ర చాలా గొప్పదట. వారు ఎల్లప్పుడై ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే తల్లిగా మీరు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి.

కుమార్తెలను మానసికంగా బలంగా, స్వతంత్రురాలిగా మార్చడంలో తల్లు పాత్ర చాలా గొప్పదట
కుమార్తెలను మానసికంగా బలంగా, స్వతంత్రురాలిగా మార్చడంలో తల్లు పాత్ర చాలా గొప్పదట

పిల్లలను మానసికంగా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండేలా పెంచడం చాలా బాధ్యతాయుతమైన పని. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది సలవాళుతో కూడినదే చెప్పాటి. ఆడపిల్లలు సమస్యలను ఎదుర్కోవడం, వాటి నుంచి కోలుకోవడం అనేది వారి మానసిక సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది.

ఆడపిల్లలు మానసికంగా బలంగా ఉండాలంటే చిన్నతనం నుంచే వారికి చక్కటి పెంపకం, మద్దతు, స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి. ఇందులో తల్లులకు ప్రధాన పాత్ర ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగో తెలుసుకుందాం రండి.

కుమార్తె పెంపకంలో తల్లుల పాత్ర..

ప్రముఖ మనోవిజ్ఞాన నిపుణురాలు జ్యోతి కపూర్ ఇండియా టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతున్న విషయం ఏంటంటే.. మీ కుమార్తెను ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పెంచాలనుకుంటే, సమస్యలను ఎదురుకునే సామర్థ్యాన్ని వారిలో పెంచాలనుకుంటే ముందుగా మీరు ఈ లక్షణాలను కలిగి ఉండాలి. ముందుగా ఈ మనస్తత్వాన్ని మీరు పెంచుకోవాలి. వారికి నేర్పించే ముందు ఈ సామర్థ్యాలను మీరు అభివ‌ృద్ది చేసుకోవాలి.

మరో మానసిక నిపుణురాలు స్వేతా శర్మ పిల్లలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పెంచడానికి తల్లులు ఏం చేయాలో చెప్పుకొచ్చారు. అవేంటంటే..

1. భావోద్వేగాలు బయటపెట్టనివ్వండి

పిల్లలను వారి భావోద్వేగాలను వ్యక్తిపరచనివ్వండి, వాటిని అణచివేయకండి. చాలా మంది మహిళలు మృదువైనవారిగా ఉంటారు. పిల్లలను కూడా చాలా సున్నితంగా ఎమోషన్స్ బయట పెట్టకుండా పెంచుతారు. ఇది చాలా పెద్ద పొరపాటు.

మీ కూతురు మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలంటే ఆమెలోని సంతోషం, కోపం, దుఃఖం, నిరాశలను వంటి భావోద్వేగాలన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వండి. ఎమోషన్స్ ని గౌరవించడం వాటిని ఆరోగ్యకరమైన విధానంలో వ్యక్తపరచడం వారికి నేర్పండి.

2. పరిష్కరించడాన్ని ప్రోత్సహించండి

మహిళలు ఎల్లప్పుడూ పనులను పూర్తిగా, పరిపూర్ణంగా చేయాలని అనుకుంటారు. ఇది మంచి అలవాటే కానీ మీ పరిపూర్ణతను పిల్లల మీద రుద్దడం వారిలో పరిపూర్ణంగా ఉండాలనే ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది సాధ్యకానప్పుుడ వారిలో నిరాశకు దారి తీస్తుంది.

తల్లిగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. తప్పులు చేయడం అనేది పిల్లల అభివృద్ధి భాగం. పరిపూర్ణత విషయంలో వారిని బలవంత పెట్టకుండా వారి దృష్టిని సమస్యలను పరిష్కరించడంపై పెట్టనివ్వండి. వారు విఫలమైనప్పుడు, దాని నుండి ఏమి నేర్చుకున్నారు, తదుపరి సారి దాన్ని వేరే విధంగా ఎలా చేయబోతున్నారు అని అడగి తెలుసుకోండి. ఆ దిశగా వారిని ప్రోత్సహించండి.

3. వారి విలువను వారికి తెలియజేయండి

ఈ సమాజం మహిళలను ఎల్లప్పుడూ అందంతో అనుసంధానించుకుంటూ ఉంటుంది. కానీ విలువ అనేది కేవలం అందంతో రాదనీ, మంచి అలవాట్లు, జ్ఞానం, ప్రేమతో పాటు ఇతర శక్తి, సామర్థ్యాల నుండి వస్తుందని వారికి తెలిసేలా నొక్కి చెప్పండి.

తల్లిగా మీరు వారి రూపాన్ని కాకుండా ప్రయత్నాలను ప్రశంసించండి. ‘నీవు అందంగా ఉన్నావు అనడానికి బదులుగా నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు తెలివైన దానివి, నీవు నీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నావు. అని వారిని ప్రశంసించండి. ఇదే వారిలో మీకు నచ్చే విషయమని వారికి తెలియజేయండి.

4. హద్దులను గౌరవించడం నేర్పండి

ఆడపిల్లలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలంటే.. హద్దులను గౌరవించడం వారికి నేర్పండి. వారి విషయంలో ఎవరైనా హద్దులను దాటినప్పుడు నిర్మొహమాటంగా నో చెప్పండి, ఎలాంటి అపరాధభావం లేకుండా ఖండించండం వారికి నేర్పించండి.

5. ఉదాహరణగా నిలవండి

పిల్లలు ఎప్పుడూ ఉదాహరణల ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి ముందు తల్లిగా మీరు మీ కూతురు ఒత్తిడిని ఆరోగ్యకరంగా నిర్వహిస్తుందో లేదో గమనించండి. వారు శ్రద్ధగా వారి భావోద్వేగాలను వ్యక్తపరుస్తున్నారా? ఒత్తిడి అధికమైనప్పుడు, విరామం తీసుకుంటున్నారా? లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వారికి నేర్పించడానికి ముందుగా మీరు ఈ పనులను చేయండి.

6. నిర్ణయాలను తీసుకోనివ్వండి

తల్లిగా మీ బిడ్డను రక్షించే బాధ్యత మీపై ఉంటుంది. కానీ ఇందుకోసం మీరు పిల్లలకు అధికంగా రక్షించకూడదని తెలుసుకోండి. ఇలా ప్రతిసారి వారికి మీరు రక్షణ కవచంలా వ్యవహరిస్తుంటే.. వారిపై వారికి నమ్మకం పెరగదు, వారికున్న సామర్థ్యాలపై వారికే సందేహాన్ని కలిగిస్తుంది.

కాబట్టి తల్లిగా మీరు వయస్సుకు తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతించండి. మీ మార్గదర్శకాలతో మీరు నేర్పించిన విలువలతో వారిని సవాళ్లకు ధీటుగా వెళ్లనివ్వండి, ఆపకండి. దారిని మాత్రమే వారికి చూపించండి.. ఆ దారిని సుగమం చేసి ఇవ్వకండి. కష్టమైన సరే వారి గమ్యాన్ని చేరుకోవడంలో వారిని ప్రోత్సహించండి. వారు వేసే అడుగులను మీరు గమనిస్తూ ఉండండి చాలు.

7. సంభాషణలకు స్థానం కల్పించండి

ఎలాంటి విషయాన్ని అయినా ఎటువంటి భయం లేకుండా, విమర్శిస్తారు అనే భావన లేకుండా, తిడతారమో, కొడతారేమో, శిక్షిస్తారేమో అనే అనుమానం లేకుండా మీ కూతురు మీతో అన్ని విషయాలను ఫ్రీగా పంచుకోవాలి. ఎలాంటి సందర్బంలో అయినా మీ మద్దతు వారికి ఉంటుందనే నమ్మకం మీపై మీ కుమార్తెకు ఉండాలి.

ఈ నమ్మకాన్ని మీరే సంపాదించుకోవాలి. మీతో కలిసి ప్రయాణించేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు లేదా ఇతర పనులు చేసేటప్పుడు వారు మీతో సులభంగా, ఫ్రీగా మాట్లాడుతున్నారా లేదా అని గమనించండి. అలా మాట్లాడేలా మీరు ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించుకోండి. మీ బిడ్డను మీరే ధైర్యంగా మలుచుకోవాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024