


Best Web Hosting Provider In India 2024
TG Inter Results 2025 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి.. ఎలా చెక్ చేసుకోవాలి.. 5 సింపుల్ స్టెప్స్
TG Inter Results 2025 : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఫలితాల్లో పారదర్శకత పాటించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల ఆఖరు లోగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ).. 2025 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 9 లక్షల 96 వేల 971 మంది పరీక్షలు రాశారు. వారు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఏ ఏడాది.. ఎప్పుడు..
ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు ప్రకటించాక.. థర్డ్ పార్టీ ఏజెన్సీలు కూడా ఫలితాలను అందుబాటులో ఉంచుతాయి. గత సంవత్సరం ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించారు. 2023కి సంబంధించి ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. 2022లో జూన్ 28న ఫలితాలను ప్రకటించారు. అదేవిధంగా 2021లో కూడా జూన్ 28న ఫలితాలను విడుదల చేశారు. 2020లో జూన్ 18న ప్రకటించారు.
ఎలా చెక్ చేసుకోవాలి..
1.ఫస్ట్ సెకెండ్ ఇయర్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ఓపెన్ చేయాలి.
2.ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బ్రిడ్జ్ కోర్స్ లింకులు కనిపిస్తాయి. దాని పక్కనే రిజల్ట్స్ లింక్ ఉంటుంది.
3.రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయాలి. రిజల్ట్ ఇయర్, ఫస్ట్ లేదా సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి.
4.క్యాటగిరీ, ఎగ్జామినేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. గెట్ మెమోపై క్లిక్ చేసి.. ఫలితాలను చూసుకోవచ్చు.
5.పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు ఓపెన్ అవుతాయి. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ తీసుకోవాలి.
35 శాతం సాధించాలి..
ఇంటర్మీడియట్ పరీక్షలు 2025లో ఉత్తీర్ణత సాధించడానికి.. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. మొత్తం మీద 35 శాతం మార్కులు సాధించిన వారు ఉత్తీర్ణులుగా పరిగణించబడతారు. ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు రీ వాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
సందేహాలు ఉంటే..
ఫలితాల విడుదల తర్వాత, మూల్యాంకనం లేదా మార్కుల విషయంలో విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే.. వారు ఇంటర్ బోర్డును సంప్రదించవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి 24 వరకు జరగగా, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చ్ 6 నుంచి 25 వరకూ జరిగాయి.
సంబంధిత కథనం
టాపిక్