



Best Web Hosting Provider In India 2024

Peddi Glimpse Memes: రామ్‌చరణ్ బ్యాటింగ్, ప్రభాస్ బౌలింగ్, ఎన్టీఆర్ క్యాచ్.. పెద్ది గ్లింప్స్‌పై మీమ్స్ వీడియోల మోత
Peddi Glimpse Memes: పెద్ది గ్లింప్స్ అదిరిపోయింది. రామ్‌చరణ్ మాస్ రగెడ్ లుక్, స్వాగ్తో అదరగొట్టారు. క్రికెట్ షాట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ గ్లింప్స్‌పై సోషల్ మీడియాలో మీమ్ వీడియోలు భారీగా వస్తున్నాయి.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ వచ్చేసింది. శ్రీరామనవమి సందర్భంగా మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 6) ఈ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్‌చరణ్ మాస్ లుక్, స్వాగ్, ఉత్తరాంధ్ర యాసలో సూపర్ డైలాగ్ అదిరిపోయాయి. డైరెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ వావ్ అనిపించింది. గ్లింప్స్ చివర్లో కొట్టే క్రికెట్ షాట్ హైలైట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్‌పై మీమ్ వీడియోలు సోషల్ మీడియాలో మోతెక్కుతున్నాయి.
పెద్ది గ్లింప్స్ చివర్లో.. బ్యాటింగ్ ఆడే రామ్‌చరణ్ క్రీజ్ వదిలి ఫ్రంట్ ఫుట్ వస్తారు. హ్యాండిల్‌ను నేలకు కొట్టి మళ్లీ లేచి బంతిని బలంగా బాదుతారు. ఇది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తోంది. దీనిపై మీమ్స్ విపరీతంగా వస్తున్నాయి. ఈ షాట్‌తో రకరకాల క్రియేటివ్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. సోషల్ మీడియాలో పెద్ది గ్లింప్స్ క్రియేటివ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్‌తో..
పెద్ది గ్లింప్స్ మీమ్ వీడియోల్లో కొన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. బ్యాట్‌తో కొట్టేందుకు రామ్‌చరణ్ ముందుకు రాగా.. సలార్ చిత్రంలోని ఓ సీన్లో ప్రభాస్ బౌలింగ్ చేసే సీన్‌ను మీమర్స్ యాడ్ చేశారు. చరణ్ బంతిని బలంగా బాదగా.. సింహాద్రి చిత్రంలో ఎన్టీఆర్ గోల్ఫ్ బంతిని క్యాచ్ పట్టిన సీన్‌ను పెట్టారు. ఈ మూడు బాగా సింక్ అయ్యేలా ఓ వీడియో క్రియేట్ చేశారు. బ్రహ్మానందం ఔట్ అని అరుస్తున్న సీన్‌ను కూడా జత చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. జల్సా చిత్రంలో పట్టిన క్యాచ్‌ను కూడా మీమ్‌లో ఉంచారు.
రామ్‌చరణ్ బంతిని కొడితే.. విక్రమార్కుడు చిత్రంలో అత్తిలి సత్తిబాబు (రవితేజ)కు తగిలినట్టు చేసిన ఓ వీడియో కూడా ఫన్నీగా ఉంది. పెద్ది చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ బంతి వేస్తే చెర్రీ షాట్ కొట్టినట్టు కూడా ఓ వీడియో క్రియేట్ చేశారు మీమర్స్. సినిమా స్టార్లకు జరిగిన టోర్నీలో చరణ్ బౌలింగ్ చేసినప్పుడు వీడియోతోనూ ఓ వీడియో చేశారు. కొందరు ఇతర యాక్టర్ల సీన్లతోనూ కలిపి రకరకాల వీడియోలను కొందరు పోస్టులు చేస్తున్నారు.
సరిగ్గా ఐపీఎల్ సీజన్లో క్రికెట్‌తో ఉండే పెద్ది గ్లింప్స్‌ను మూవీ టీమ్ తీసుకురావడం మరింత స్పెషల్‌గా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా కొందరు క్రికెటర్ల వీడియోలను కూడా ఈ గ్లింప్స్‌కు యాడ్ చేసి కొందరు పోస్టులు చేస్తున్నారు.
పెద్ది సినిమాను ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నారు. గ్లింప్స్ వీడియోతో అంచనాలను పూర్తిగా అందుకున్నారు. ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమాను వచ్చే ఏడాది 2026 మార్చి 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
పెద్ది మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
సంబంధిత కథనం