



Best Web Hosting Provider In India 2024

OTT Psychological Thriller: సాయిపల్లవి నటించిన ఈ థ్రిల్లర్ చిత్రం చూశారా.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్! ఏ ఓటీటీలో..
OTT Psychological Thriller: సాయిపల్లవి నటించిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ క్లాసిక్‍గా నిలిచింది. ఈ మూవీలో ఆమె నటన అద్భుతం అనేలా ఉంటుంది. ఈ మలయాళ మూవీ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఆ చిత్రమేదో ఇక్కడ చూడండి.

మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన అతిరన్ చిత్రం చాలా ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీలో మానసిక సమస్య ఆటిజంతో బాధపడుతున్న అమ్మాయిగా తన నటనతో సాయి పల్లవి మెప్పించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం మలయాళంలో 2019 ఏప్రిల్‍లో రిలీజైంది. మంచి కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. ట్విస్టులతో ఉండే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ఓటీటీలో అనుకోని అతిథి పేరుతో ఈ అతిరన్ మూవీ అందుబాటులోకి ఉంది.
థ్రిల్లర్ చిత్రాలు ఇష్టమున్న వారికి అతిరన్ బాగా నచ్చేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మతిపోయేలా ఉంటుంది. ఈ చిత్రం ఆసాంతం సస్పెన్స్ కూడా కొనసాగుతుంటుంది. ఒకవేళ ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూడకపోతే మిస్ కాకూడని చిత్రమిది. ఇప్పుడు ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..
స్ట్రీమింగ్ ఇక్కడే..
అతిరన్ సినిమా తెలుగు వెర్షన్ ‘అనుకోని అతిథి’ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. ఈ మూవీ ఆహాలో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఇంకా చూడకపోతే ఆహాలో ట్రై చేయవచ్చు. అతిరన్ మలయాళంలో జియోహాట్‍స్టార్ ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.
అతిరన్ (అనుకోని అతిథి) చిత్రానికి వివేక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఫాహద్ ఫాజిల్, సాయిపల్లవితో పాటు అతుల్ కులకర్ణి, ప్రకాశ్ రాజ్, రంజిత్ పనికర్, సుదేవ్ నాయర్, శక్తికృష్ణ కీరోల్స్ చేశారు. ఈ సినిమాకు జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా బలంగా నిలిచింది.
బాక్సాఫీస్ హిట్
అతిరన్ సినిమా సుమారు రూ.8కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ సుమారు రూ.2కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. రూ.8కోట్ల మార్క్ దాటి ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ సాధించింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ అనుకోని అతిథి నేరుగా ఆహా ఓటీటీలోకే వచ్చింది. ఈ మూవీని సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్ పతాకంపై రాజు మాథ్యూ ప్రొడ్యూజ్ చేశారు.
అతిరన్ స్టోరీలైన్
ఓ ప్యాలెస్‍లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఘోరమైన హత్యకు గురవుతారు. ఆ తర్వాత అదే ఫ్యామిలీకి చెందిన మానసిక సమస్యతో బాధపడే నిత్య (సాయిపల్లవి) అడవి మధ్యలో ఉండే ఓ ఆసుపత్రిలో ఉంటుంది. బెంజిమన్ (అతుల్ కులకర్ణి) ఆ ఆసుపత్రి నడుపుతుంటాడు. నిత్యను అక్కడ వాళ్ల అంటీ అక్కడ చేర్పిస్తుంది. అక్కడ మిగిలిన రోగులు స్వేచ్ఛగా తిరుగుతుంటే నిత్యను మాత్రం బంధించి ఉంచుతాడు బెంజిమన్. ఈ క్రమంలో అక్కడికి సైకాలజిస్ట్ ఎంకే నంద (ఫాహద్ ఫాజిల్) వస్తాడు.
నిత్యను కూడా ఆసుపత్రిలో ఫ్రీగా వదిలేస్తాడు నంద. అసలు ఆ కుటుంబంలోని వారిని హత్య చేసింది ఎవరు? డాక్టర్ నంద ఎవరు? ఎందుకు పల్లవిపై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు? దీని వెనుక మిస్టరీ ఏంటి? అనే అంశాల చుట్టూ ఈ అతిరన్ స్టోరీ సాగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఊహించని ఓ ట్విస్ట్ ఉంటుంది. ఇది ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ మూవీ థ్రిల్లింగ్‍గా ఉన్నా.. అక్కడక్కగా కాస్త స్లోగా అనిపిస్తుంది. ఓవరాల్‍గా మెప్పిస్తుంది.
సంబంధిత కథనం