CPM General Secretary : సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఎ బేబీ.. ఇంతకీ ఈయన ఎవరు?

Best Web Hosting Provider In India 2024


CPM General Secretary : సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఎ బేబీ.. ఇంతకీ ఈయన ఎవరు?

Anand Sai HT Telugu
Updated Apr 06, 2025 09:25 PM IST

CPM New General Secretary : సీపీఐ(ఎం) కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఎ బేబీని ఎన్నికయ్యారు. తమిళనాడులోని మధురైలో జరిగిన సీపీఎం 24వ మహా సభల్లో ఆయనను ఎన్నిక చేశారు.

ఎంఎ బేబీ
ఎంఎ బేబీ

వామపక్ష పార్టీ సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఎ బేబీ ఎన్నికయ్యారు. ఇఎంఎస్ నంబూద్రిపాద్ తర్వాత ఈ పదవిని చేపట్టిన కేరళ నుండి రెండో నాయకుడు ఆయన. బేబీ మైనారిటీ సమాజం నుండి వచ్చిన మొదటి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, ఆయన రాజకీయ ప్రయాణం విద్యార్థి రాజకీయాలతో ప్రారంభమైంది. రాజ్యసభలో కూడా పనిచేశారు. కేరళలో విద్యా మంత్రిగా కూడా చేశారు.

తమిళనాడులోని మధురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్‌లో ఎంఎ బేబీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 75 ఏళ్లలోపు అత్యంత సీనియర్ కేంద్ర కమిటీ నాయకులలో ఎంఎ బేబీ (70) ఒకరు. గత సెప్టెంబర్‌లో సీతారాం ఏచూరి మరణం తర్వాత పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమన్వయకర్తగా నియమితులైన మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు బేబీ.

కొల్లం జిల్లాలోని ప్రాక్కుళంలో జన్మించిన బేబీ, మైనారిటీ సమాజం నుండి వచ్చిన మొదటి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి. దిల్లీలో కొచ్చి ద్వైవార్షిక కళా ప్రదర్శన, స్వరలయ సాంస్కృతిక సంస్థను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. 1954లో పీఎం అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు జన్మించిన ఎంఏ బేబీ పాఠశాల రోజుల్లో కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరారు. 1986 నుండి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2012 నుండి ఆయన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.

32 సంవత్సరాల వయసులో బేబీ 1986లో అతి పిన్న వయస్కుడైన ఎంపీలలో ఒకరిగా రాజ్యసభలోకి ప్రవేశించి 1998 వరకు ఎగువ సభలో కొనసాగారు. బేబీని పార్టీ భవిష్యత్ నాయకులలో ఒకరిగా పరిగణించారు. ఆ తర్వాత కేంద్ర కమిటీలోకి చేర్చారు. అయితే కేరళ సీపీఐ(ఎం)లో నెలకొన్న గందరగోళం, మారుతున్న సమీకరణాలు పార్టీలో బేబీ అభివృద్ధిని తగ్గించాయి. ఎందుకంటే పినరయి విజయన్, కొడియేరి బాలకృష్ణన్, ఎంవీ గోవిందన్ వంటి ఇతర నాయకులు ముందుకు వచ్చారు.

గత ఏడాది సెప్టెంబర్ 12న సీతారాం ఏచూరి మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. ఆ తర్వాత ప్రకాష్ కారత్ తాత్కాలిక సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా సమావేశాల్లో ఎంఏ బేబీని సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు. దేశంలో అతిపెద్ద వామపక్ష పార్టీ సీపీఐ(ఎం) 24వ పార్టీ కాంగ్రెస్ ఏప్రిల్ 2న ప్రారంభమై ఆదివారం ముగిసింది.

Anand Sai

eMail

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link