




Best Web Hosting Provider In India 2024

Pushpa 2 Telecast: ఒకే రోజు మూడు భాషల్లో టెలికాస్ట్ కానున్న పుష్ప 2 చిత్రం.. ఏ ఛానెల్‍లో, ఏ టైమ్‍కు రానుందంటే..
Pushpa 2 Telecast: పుష్ప 2 సినిమా మూడు భాషల్లో ఒకే రోజు టీవీ ప్రీమియర్‌కు రానుంది. మరో భాషలో తదుపరి రోజు రానుంది. ఆయా భాషల్లోని ఛానెళ్లలో ప్రసారం కానుంది. టెలికాస్ట్ టైమింగ్స్ కూడా ఖరారయ్యాయి.

పుష్ప 2: ది రూల్ సినిమా ఇక టీవీలో హవా చూపేందుకు సిద్ధమవుతోంది. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‍ను భారీ కలెక్షన్లతో షేక్ చేసింది. ఓటీటీలోనూ దుమ్మురేపింది. ఇప్పుడు టీవీ ఛానెళ్లలో ప్రసారానికి వచ్చేస్తోంది. మూడు భాషల్లో ఒకే రోజు పుష్ప 2 టీవీ ప్రీమియర్ కానుంది. ఓ భాషలో ఓ రోజు ఆలస్యంగా అడుగుపెట్టనుంది. డేట్, టైమింగ్స్, ఛానెళ్ల వివరాలు బయటికి వచ్చేశాయి.
టెలికాస్ట్ వివరాలు ఇవే
పుష్ప 2 సినిమా తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 13న వేర్వేరు ఛానెళ్లలో టీవీ ప్రీమియర్ కానుంది. తమిళంలో ఓ రోజు తర్వాత రానుంది. తెలుగులో ఏప్రిల్ 13వ తేదీన స్టార్ మా ఛానెల్‍లో సాయంత్రం 5.30 గంటలకు ఈ చిత్రం టెలికాస్ట్ అవుతుంది. మలయాళంలో ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఏషియానెట్ టీవీ ఛానెల్‍లో టీవీ ప్రీమియర్ అవుతుంది.
ఈ చిత్రం కన్నడలో ఏప్రిల్ 13వ తేదీన సాయంత్రం 7 గంటలకు కలర్స్ కన్నడ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. తమిళంలో స్టార్ విజయ్ ఛానెల్‍లో ఏప్రిల్ 14 మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం మొదలవుతుంది. ఇతర మూడు భాషల కంటే తమిళంలో ఓ రోజు ఆలస్యంగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో పుష్ప 2 చిత్రం విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. ఫుల్ హైప్ మధ్య వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అన్ని భాషల్లో అదరగొట్టింది. చాలా రికార్డులను సృష్టించింది. ఇండియాలో అత్యధిత వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. హిందీలో బాలీవుడ్ సినిమాల రికార్డులను బద్దలుకొట్టేసింది. హిందీ నెట్ కలెక్షన్లలో రూ.800కోట్లను దాటిన తొలి చిత్రం చరిత్ర క్రియేట్ చేసింది. ఈ సినిమా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1,1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దుమ్మురేపుంది.
ఓటీటీలో ఏడు భాషల్లో..
పుష్ప 2 సినిమా జనవరి చివర్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. భారీ వ్యూస్‍తో అదరగొట్టింది. గ్లోబల్ రేంజ్‍లోనూ చాలా రోజులు ట్రెండ్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్ప బ్లాక్‍బస్టర్ తర్వాత సీక్వెల్‍పై భారీ హైప్ ఉండగా..అంచనాలు అందుకునేలా తెరకెక్కించారు. మరింత భారీతనంతో అదిరిపోయే యాక్షన్‍తో సినిమాను రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు. అల్లు అర్జున్ మరోసారి యాక్షన్, స్వాగ్‍తో వావ్ అనిపించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది.
పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్, జగదీశ్, సునీల్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూజ్ చేశారు.
అల్లు అర్జున్ తదుపరి తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ యాక్షన్ చిత్రం చేయనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో మైథలాజికల్ మూవీలో నటించనున్నారు.
సంబంధిత కథనం