




Best Web Hosting Provider In India 2024

Siddhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ ఆల్‌రౌండర్.. డైరెక్షన్ చేయమను కోరుతున్నారు.. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కామెంట్స్
Producer BVSN Prasad About Siddhu Jonnalagadda Direction: హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా జాక్. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డపై నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Producer BVSN Prasad About Siddhu Jonnalagadda Direction: టిల్లు స్క్వేర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.
చాలా కాలం గ్యాప్ తర్వాత
హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ కామెడీ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాక్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ చేసిన సినిమా ఇది. దీంతో జాక్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అలాగే, జాక్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య నటించింది.
జాక్ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. జాక్ మూవీ ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన జాక్ పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు మరింత పెంచేశాయి.
భీమవరంలోని కాలేజ్‌లో
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో జాక్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది మూవీ టీమ్. ఇందులో భాగంగానే రీసెంట్‌గా భీమవరంలోని విష్ణు కాలేజీలో జాక్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ .. “సిద్దు జొన్నలగడ్డ ఆల్ రౌండర్. కానీ, ఇప్పుడు ఇక్కడి విద్యార్థులు డైరెక్షన్ చేయమని కోరుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇలా సినిమాలు తీయనివ్వండి. జాక్ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 11న ఈ సినిమా రానుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి” అని అన్నారు. ఇప్పుడు సినిమాలు చేయను ఆ తర్వాత డైరెక్షన్ వైపు ఆలోచించని అన్నట్లుగా నిర్మాత మాట్లాడారు.
మళ్లీ మళ్లీ ఈ టైమ్ రాదు
ఇక స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. “భీమవరం వచ్చి ఇలా మీ (స్టూడెంట్స్) అందరినీ కలవడం ఆనందంగా ఉంది. కాలేజ్ లైఫ్ ఎంతో అందంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ ఈ టైమ్ మళ్లీ రాదు. ఎంజాయ్ చేయండి. స్టూడెంట్ ఎనర్జీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. విష్ణు కాలేజ్‌లో ఈవెంట్ చేయడం సంతోషంగా ఉంది. ఏప్రిల్ 10న జాక్ చిత్రం రాబోతోంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని తెలిపాడు.
“నాకు కాలేజ్ లైఫ్ అంటే చాలా ఇష్టం. మీ అందరిలా ఇలా ఈవెంట్లు, ఫెస్ట్‌లో వచ్చి ఎంజాయ్ చేయాలని ఉండేది. ఏప్రిల్ 10న మా జాక్ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. చాలా ఫన్‌గా, ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. మీ అందరికీ మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. సిద్దుతో నటించడం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చింది. చాలా టాలెంటెడ్ పర్సన్. జాక్ టీంతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది” అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది.
సంబంధిత కథనం