



Best Web Hosting Provider In India 2024

Tea For Period Cramps: పీరియడ్స్ సమయంలో ఈ టీ తాగారంటే నొప్పి బాధే ఉండదు.. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ!
Tea For Period Cramps: పీరియ్సడ్స్ సమయంలో నొప్పిని భరించలేకపోతున్నారా? దీన్ని తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? వెంటనే ఆపేయండి. ఈ టీ తాగారంటే సహజంగానే మీ పీరియడ్ క్రాంప్స్ ను తగ్గించుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ ఉంది.

పీరియడ్స్ అనేవి అందరి ఆడవాళ్లు ప్రతినెల ఎదుర్కునే సమస్యే. ఈ సమయంలో కడుపులో నొప్పి, అలసట, నీరసం, వాంతులు, మైకం వంటి వన్నీ సహజమైన లక్షణాలే. అయితే ఈ సమస్యలు అందిరికీ సాధారణ స్థాయిలోనే ఉండకపోవచ్చు. కొందరికి పీరియడ్స్ వచ్చాక మూడు రోజు నరకంలా అనిపిస్తుంది. తీవ్రమైన కడపు నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి, వికారం వంటివి అధిక మొత్తంలో ఇబ్బంది పెడుతుంటాయి. కొందరు బాధ తట్టుకోలేక ఏడుస్తుంటారు. పడుకునే ఉంటారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం ప్రతి నెల పెయిన్ రిలీఫ్ మెడిసిన్ ను వాడుతుంటారు.
ఈ మందులు పీరియడ్ క్రాంప్స్ నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయేమో. కానీ దీర్ఘకాలికంగా ఇవి హార్మోన్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పీరియడ్ నొప్పులను సహజంగా తగ్గించుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారపు నియమాలతో వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి వాటిలో ఒకటే ఈ టీ.
పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఆ సమయంలో ఈ టీ తయారు చేసుకుని తాగాలి. ఇది కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి వంటి వాటి నుంచి చక్కటి ఉపశమనాన్ని అందించడంతో పాటు శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది. శక్తివంతమైన ఈ టీని తయారు చేయడం కూడా చాలా సులువు. పీరియడ్ నొప్పులను తగ్గించే మ్యాజికల్ టీని తయారు చేయడం ఎలాగో ప్రముఖ న్యూట్రీషియన్ శ్వేతా షా తన ఇన్స్స్టాగ్రామ్ లో వివరించారు.
పీరియడ్ నొప్పులను తగ్గించే మ్యాజికల్ టీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
- వాల్నట్స్ పొడి- ఒక టీస్పూన్
- అల్లం పొడి- అర టీస్పూన్
- బెల్లం -ఒక టేబుల్ స్పూన్
- నీరు – రెండు కప్పులు
మ్యాజికల్ టీ తయారీ విధానం:
- ఈ టీ తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో రెండు కప్పుల వరకూ నీటిని పోయండి.
- ఈ నీటిలో దంచి పొడి చేసుకున్న వాల్నట్స్, అల్లం పొడి, బెల్లం తురుము వేసి కాసేపు మరగనివ్వండి.
- తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత వడకట్టుకుని తాగేయండి.
ఈ టీ పీరియడ్ నొప్పులను తగ్గించేందుకు ఎలా పని చేస్తుంది?
- ఇందులో వేసి వాల్నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాట యాసిడకలు, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కండరాలు రిలాక్స్ అయి నొప్పి, మంట వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.
- ఈ టీలో ఉపయోగించిన అల్లం పొడి సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పితో పాటు నీరసాన్ని కూడా తగ్గిస్తుంది.
- చివరగా టీని కమ్మగా మార్చే బెల్లం బ్లోటింగ్ సమస్యను తగ్గించడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
- పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గించుకోవడానికి ఈ టీని తప్పక ప్రయత్నించండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం