




Best Web Hosting Provider In India 2024

Summer Drinks: ఎండలు ముదిరిపోతున్నాయి, గుండెను రక్షించుకోవడానికి ఈ పానీయాలు ప్రతిరోజూ తాగండి
Summer Drinks: వేసవిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటారు. దీన్ని నివారించడానికి కొన్ని రకాల పానీయాలను ఆహారంలో కచ్చితంగా చేర్చుకోవాలి. ఇవి వడదెబ్బ నుండి కూడా శరీరాన్ని కాపాడతాయి.

ఎండల వేడిని తట్టుకునే పానీయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి తాగడం వల్ల మీరు ప్రాణాంతక పరిస్థితులు బారిన పడకుండా బయటపడవచ్చు. రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. ఒక్కో నగరంలో వేడి గాలులు విపరీతంగా వీస్తున్నాయి. వాతావరణ శాఖ చెబుతున్న ప్రకారం ఎండలు విపరీతంగా మారి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతాయి.
దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఎదుర్కొనే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే పగటి ఉష్ణోగ్రత రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు. వేసవికాలంలో గుండె జబ్బులు అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి గుండె కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం.
తీవ్రమైన వేడి వల్ల బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. ఈ సమయంలో సరైన ఆహారం తర్వాత తీసుకోవడం చాలా ముఖ్యం. గుండెను ఆరోగ్యంగా ఉంచే కొన్ని పానీయాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లబరచటమే కాదు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. గుండెపోటు బారిన పడకుండా రక్షిస్తాయి.
కొబ్బరినీళ్లు, పుదీనా, నిమ్మకాయ రసం
కొబ్బరినీటిలో సహజ ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. తాజా కొబ్బరి బోండాన్ని ప్రతిరోజూ తాగాల్సిన అవసరం ఉంది. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేస్తాయి. ఎలక్ట్రోలైట్లు సమతుల్యతను కూడా కాపాడతాయి. కొబ్బరినీళ్ళలోనే పుదీనాను, నిమ్మకాయను జోడించి తాగితే శీతలీకరణ ప్రభావం మరింత పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
ఉసిరి, కలబంద రసం
ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి ధమనులలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ కూడా చేస్తాయి. అలాగే ఉసిరి, కలబంద రసం తయారు చేసుకుంటే కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
మందార టీ
వేడి వేడి మందార టీ కన్నా ఐస్ క్యూబ్స్ వేసిన మందార టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. మందారంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు మందార పువ్వులను నీటిలో వేసి బాగా మరగ కాచాలి. వాటిని వడకట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అందులో రెండు ఐస్ క్యూబ్స్ వేసి మెల్లగా సిప్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండెజబ్బులకు ప్రధాన కారకాలైన బీపీ, కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడతాయి. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.
దోసకాయ తులసి రసం
కీరా దోసకాయలు వేసవిలో అధికంగా దొరుకుతాయి. దీనిలో 90 శాతం నీరే ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. దోసకాయని తినడం లేదా దోసకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ దోసకాయ రసంలో తులసి ఆకులను కూడా వేసి తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రక్తనాళాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల నుండి కాపాడతాయి. కాబట్టి దోసకాయ రసం తీసి అందులోనే తులసి ఆకుల రసాన్ని పిండి కలపండి. లేదా తులసి ఆకులను వేసి ఒక గంట పాటు అలా వదిలేయండి. వాటిలో ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని మెల్లమెల్లగా సిప్ చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
దానిమ్మ, బీట్రూట్ రసం
దానిమ్మ, బీట్రూట్ కలిపి చేసే రసం ఎర్రగా ఉంటుంది. దీనిలో నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. మీరు ఎండలో బయటికి వెళ్ళడానికి ముందు ఒక గ్లాసు దానిమ్మ బీట్రూట్ కలిపి చేసిన రసాన్ని తాగండి. ఇది ఎంతో మేలు చేస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం