




Best Web Hosting Provider In India 2024

Stray Dog Attack: గుంటూరులో ఘోరం.. వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి,మెడ కొరకడంతో దుర్మరణం
Stray Dog Attack: గుంటూరులో దారుణ ఘటన జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్క మెడ భాగంలో నోట కరిచి లాక్కేళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది.

Stray Dog Attack: గుంటూరులో వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిని నోట కరుచుకు పోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు.
గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. నగర శివారులోని అడవి తక్కెళ్లపాడు పరిథిలోని స్వర్ణభారత్ నగర్‌కు చెందిన కె. నాగరాజు, రాణిమెర్సి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వీరిలో చివరి వాడు నాలుగేళ్ల ఐజక్. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు ప్రార్ధనల కోసం వెళుతూ తమతో పాటు ఐజక్‌ను కూడా తమతో తీసుకెళ్లారు. తల్లిదండ్రులు ప్రార్థనల్లో ఉన్న సమయంలో బాలుడు మూత్రవిసర్జన కోసం బయటకు రావడంతో అక్కడున్న వీధి కుక్క దాడిచేసింది.
బాలుడి మెడ పట్టుకుని కొంతదూరం ఈడ్చు కెళ్లింది. అక్కడున్న స్థానికులు చూసి కుక్కను వెంబడించడంతో బాలుడిని వదిలి పెట్టింది. అప్పటికే తీవ్ర రక్త స్రవమైన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జీజీహెచ్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో జీజీహెచ్ కు చేరుకొని శవపరీక్ష చేయొద్దని, తమను ప్రభుత్వం ఆదుకో వాలని ఆందోళనకు దిగారు. స్వర్ణభారత్‌నగర్‌లో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నగరపాలక సంస్థ అధికారులు వాటిని పట్టుకునే యత్నం చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రుల సంతాపం..
వీధి కుక్క దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై మునిసిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఘట నకు గల కారణాలపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ తేజ, జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులుతో మంత్రి నారాయణ ఫోన్లో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో కమిషనర్ చిన్నారి తల్లిదండ్రులను జీజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించారు.
సంబంధిత కథనం
టాపిక్