




Best Web Hosting Provider In India 2024

Court OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి సూపర్ హిట్ కోర్ట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్.. ఎక్కడంటే..
Court OTT Release Date: కోర్ట్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. డేట్ కూడా ఖరారైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ లీగల్ డ్రామా చిత్రం భారీ కలెక్షన్లతో ఆశ్చర్యపరిచింది. ప్రియదర్శి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం మార్చి 14వ తేదీన విడుదలైంది. హర్ష్ రోహణ్, శ్రీదేవి కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అంచనాలను మించి బ్లాక్‍బస్టర్ అయింది. కోర్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో స్ట్రీమింగ్ తేదీ కన్ఫర్మ్ అయింది.
ఈవారంలోనే స్ట్రీమింగ్.. డేట్ ఇదే
కోర్ట్ చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తేదీ గురించి ఇటీవలే రూమర్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు అఫీషియల్‍గా కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కోర్ట్ సినిమా లిస్ట్ అయింది. అధికారిక పోస్టర్ కూడా త్వరలో రానుంది.
కోర్ట్ చిత్రం థియేటర్లలో తెలుగులో రిలీజై బంపర్ హిట్ సాధించింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో ఐదు భాషల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఏప్రిల్ 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది.
నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి..
కోర్ట్ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని తన ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించారు. దీంతో ఈ మూవీకి ఆరంభం నుంచి ఫుల్ బజ్ వచ్చింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. దీంతో అనుకున్న దాని కంటే ఎక్కువ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాను గ్రిప్పింగ్‍గా తెరకెక్కించారు డైరెక్టర్ రామ్ జగదీశ్. లవ్ స్టోరీ, పోక్సో కేసు చుట్టూ కథ రాసుకున్న అతడు.. తెరపై అంతే ఎఫెక్టివ్‍గా చూపించారు.
రూ.10కోట్ల బడ్జెట్.. రూ.57కోట్ల కలెక్షన్లు
కోర్ట్ సినిమా దాదాపు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం మొత్తంగా రూ.57కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద బంపర్ బ్లాక్‍బస్టర్ సాధించింది. అంచనాలకు మించిన కలెక్షన్లతో నానికి బాగా లాభాలను తెచ్చిపెట్టింది. మంచి చిత్రంగానూ పేరు తెచ్చుకుంది.
కోర్ట్ సినిమాలో ప్రియదర్శి, హర్ష్, శ్రీదేవితో పాటు శివాజీ, హర్షవర్దన్, సాయికుమార్, సురభి పార్వతి, రోహిణి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో నెగెటివ్ రోల్‍లో శివాజీ రెచ్చిపోయారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ప్రశాంతి త్రిపురనేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించగా.. నాని సమర్పకుడిగా ఉన్నారు.
కోర్ట్ స్టోరీలైన్
వాచ్‍మెన్ కొడుకు అయిన చందు అలియాజ్ చందు (హర్ష్ రోహణ్), జాబిల్లి (శ్రీదేవి) ప్రేమలో పడతారు. కులం, స్థాయి అంటే పిచ్చి ఉండే శ్రీదేవి బాబాయ్ మంగపతి (శివాజీ)కి ఈ విషయం తెలుస్తుంది. చందుపై కావాలనే పోక్సో కేసు పెట్టించి జైలుకు పంపిస్తాడు. చందుకు శిక్ష తప్పదనే పరిస్థితికి వస్తుంది. ఆ తరుణంలో చందు తరఫున వాదించేందుకు లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి) ఈ కేసును చేపడతాడు. చందు ఏ తప్పు చేయలేదని సూర్య నిరూపిస్తాడా? కేసులో ఎలాంటి సవాళ్లు ఎదురయయ్యాయి? అనే అంశాలు కోర్ట్ చిత్రంలో ఉంటాయి. ఈ మూవీ ఆసాంతం గ్రిప్పింగ్‍గా, ఆసక్తికరంగా సాగుతుంది.
సంబంధిత కథనం