




Best Web Hosting Provider In India 2024

Fitness After 30: ముప్పై ఏళ్లు దాటాక కూడా స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించాలంటే ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండాలి!
Fitness After 30 years: మసాలా దినుసుల నుండి కాక్టెయిల్స్ వరకు, మీ 40 ఏళ్ళలో ఆరోగ్యంగా, సన్నగా మరియు సంతోషంగా ఉండటానికి మీరు నివారించాల్సిన ఆహార పదార్ధాలను తెలుసుకోండి.

వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయి. అవయవాలు, చర్మం వదులుగా మారి వృద్ధాప్య ఛాయలు కనపడుతుంటాయి. ముఖ్యంగా బరువు విషయంలో హెచ్చ తగ్గులు మొదలవుతాయి. వీటి కారణంగా అనేక రకాల వ్యాధులు కూడా వస్తుంటాయి. కాబట్టి వయసు పెరిగే కొద్దీ శరీర బరువు, చర్మాం, అవయవాల ఆరోగ్యం విషయంలో అధిక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండటంతో పాటు యవ్వనంగా, ఫిట్‌గా కనిపించాలంటే ముప్పై ఏళ్లు దాటిన తర్వాత కొన్ని రకాల నియమాలను పాటించాలి. వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి వాటితో పాటు ఆహార నియమాలను కూడా అనుసరించాలి. ముఖ్యమైన ఇష్టమైనవి అయినప్పటికీ కొన్ని రకాలకు ముప్పై దాటిందంటే చాలా దూరంగా ఉండాలి.
వయసు పెరిగే కొద్దీ ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి?
30 ఏళ్లు దాటాయంటే సీరయస్ గా, స్ట్రిక్ట్ గా పాటించాల్సిన ఆహార నియమాలేంంటే.. కడుపులో మంట, అనారోగ్యకరమైన బరువు పెరగడానికి దారితీసే కొన్ని ఆహార పదార్థాలను తగ్గించాలి. కొన్ని ఆహార పదార్థాలు ఎలా అనారోగ్యకరమైనవి, తాపజనక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఫిట్‌గా, యంగ్‌గా కనిపించాలంటే వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అవేంటంటే..
1. మసాలా దినుసులు:
మసాలా దినుసులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ 30 ఏళ్లు దాటాయంటే వీటిని తినడం తగ్గించాలి. వీటిని ఎక్కువగా తిన్నారంటే కడుపులో మంట,అజీర్తితో పాటు మొటిమలు వంటి చర్మ సమస్యలు వస్తాయి.
2. సాస్‌లు:
సాస్ లంటే చాలా మందికి బాగా ఇష్టం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. కానీ వీటిని తినడం చాలా ప్రమాదకరమని తెలుసుకోండి. ఎందుకంటే సాస్‌ల తయారీలో టన్నుల కొద్దీ ఉప్పు, చక్కెర, నూనెలు కలిగి ఉంటాయి. అవి బరువు పెరగడానికి దారితీసే ఖాళీ కేలరీలు కూడా. కాబట్టి 30 ఏళ్లు దాటాయంటే వీలైనంత వరకూ వీటికి దూరంగా ఉండండి. మీకు కావాలంటే సాస్ ల స్థానంలో పెరుగును చేర్చుకోండి.
3. డీప్ ఫ్రైడ్ ఫుడ్:
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కానీ ఇవి క్యాలరీలను విపరీతంగా పెంచుతాయి. ముఖ్యంగా బయట తయారు చేసే ఆహార పదార్థాలలో అనారోగ్యకరమైన నూనెలను ఉపయోగిస్తారు. ఇది శరీరానికి విషంతో సమానం. వీటిని తినడం వల్ల మంట, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిసిఒఎస్ ఉన్నవారిపై, లిపిడ్ ప్రొఫైల్, కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిపై ఇవి తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
4. సోడా లేదా క్యాన్డ్ డ్రింక్స్:
ప్యాక్ చేసి ఉంచే సోడాలు, డ్రింక్స్ వంటి వాటిలో హానికరమైన రసాయనాలు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కేలరీలు కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు సులభంగా పెరుగుతారు. యవ్వనత్వాన్ని త్వరగా కోల్పోతారు.
5. కాక్టెయిల్స్ లేదా హార్డ్ ఆల్కహాల్:
ఆల్కహాల్ / మిక్సర్లు శరీరానికి హాని చేసి కేలరీలతో నిండి ఉంటాయి. వీటిని సేవించడం వల్ల కడుపులో మంటతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. వృద్దాప్య ఛాయలకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. కాబట్టి అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే వీటికి దూరంగా ఉండటం చాలా అవసరం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం