Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతికి పెళ్లి సంబంధం- మాణిక్యం మటన్ గోల- రోహిణి గుట్టు కక్కిస్తానన్న బాలు

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతికి పెళ్లి సంబంధం- మాణిక్యం మటన్ గోల- రోహిణి గుట్టు కక్కిస్తానన్న బాలు

Sanjiv Kumar HT Telugu
Published Apr 07, 2025 09:00 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial April 7th Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 7 ఎపిసోడ్‌లో రోహిణి మావయ్యగా వచ్చిన మాణిక్యం మటన్, దాన్ని కొట్టడం, తినడం గురించే మాట్లాడుతుంటాడు. అడుగడుగున బాలుకు అతనిపై డౌట్ వస్తుంది. దాంతో అతనితో తాగించి గుట్టు కక్కిస్తానని బాలు చెబుతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 7 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 7 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి మావయ్యగా మటన్ కొట్టు మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు. మలేషియా నుంచి అతను వచ్చినట్లు రవి, శ్రుతి అనుమానపడతారు. బాలు సెటైర్లు వేస్తాడు. మీనా హారతి తీసుకురా అని ప్రభావతి అంటే.. రోహిణి తెస్తుందని చెబుతుంది.

కుడితిలో పడ్డ ఎలుకలా

కుడితిలో పడ్డ ఎలుకలా ఉన్నాడు. ఇప్పుడేం హారతి గానీ ముందు వెళ్లి స్నానం చేసి రమ్మను అని సుశీల అంటుంది. దాంతో బాత్రూమ్‌కు దారి చూపించి వెళ్లమంటుంది రోహిణి. మాణిక్యం వెళ్తాడు. బాలుతోపాటు అంతా తెగ నవ్వుకుంటారు. మా మావయ్యకు పల్లెటూరు కొత్త ఎలా నవ్వుతున్నారో చూడండి అని రోహిణి అంటుంది. తర్వాత మీ మావయ్య ఏం తింటారు అని పెద్ద లిస్ట్ చెబుతుంది ప్రభావతి. ఇది ఆయన వింటే నువ్ హోటల్‌లో వెయిటర్‌గా చేసినట్లున్నావ్ అనుకుంటాడని సత్యం అంటాడు.

ఇంతలో మాణిక్యం రెడీ అయి వస్తే.. పండుకోతి ఇంట్లో దూరినట్లు ఉందని రవి అంటాడు. దాంతో అంతా మాణిక్యం గెటప్ చూసి షాక్ అవుతారు. కెమెరా ఎక్కడ పెట్టారో, ఎంత వెతికినా కనపడట్లేదే అని మాణిక్యం అంటాడు. పగటివేషగాడిలా ఆ వాలకం ఏంటని సుశీల అంటుంది. పోయిన నెల గోవాకు వెళ్లినప్పుడు కొన్నానులెండి అని మాణిక్యం అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. మీరు పోయిన నెల ఇండియాకు వచ్చారా అని మనోజ్ అడుగుతాడు.

బిజినెస్ పనిమీద వచ్చారట. అక్కడ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారట అని రోహిణి కవర్ చేస్తుంది. అయినా ఎందుకు రాలేదని ప్రభావతి అంటే.. సంక్రాంతికి నేను చాలా బిజీగా ఉంటాను, నలుగురిని పెట్టుకున్న అందించలేనంత బిజీగా ఉంటాను అని మటన్ గురించి చెబుతాడు. సంక్రాంతికి మలేషియాలో మీరెందుకు బిజీగా ఉంటారు. ఇక్కడ మటన్, చికెన్ అమ్మెవారు కదా బిజీగా ఉంటారు అని మీనా డౌట్ పడుతుంది.

మేకప్ వేసినట్లుంది

రోహిణి ఏదో కవర్ చేస్తుంది. సరే సరే ముందు మీరు బయటకెళ్లండి అని ప్రభావతి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. హారతి ఇవ్వాలమ్మా అని చెబుతుంది. రోహిణి, మీనా, శ్రుతి ముగ్గురు మాణిక్యంకు హారతి ఇస్తారు. ప్రయాణం బాగా జరిగిందా అని సత్యం అడిగితే.. రోడ్డే బాగాలేదు. మట్టిరోడుకు మేకప్ వేసినట్లుంది. ఇండియాకు ఫ్లైట్‌లో వచ్చాను. ఇక్కడికి బస్‌లో వచ్చాను అని మాణిక్యం అంటాడు. అదేంటీ కారులో వచ్చానని చెప్పారు అని శ్రుతి అంటుంది.

రాజమండ్రి వరకు బస్‌లో వచ్చి అక్కడి నుంచి కారులో వచ్చారు అని రోహిణి కవర్ చేస్తుంది. పాప మీ నాన్నగారు నీకు గిఫ్ట్స్ పంపించారని మాణిక్యం చెబితే.. అవి గొప్పగానే ఉంటాయి. అల్లుడు, కూతురుకి కలిపే పంపించి ఉంటారని ప్రభావతి అంటుంది. మీరు రావడం సంతోషంగా ఉంది. తన నాన్నగారు కూడా వస్తే బాగుండేది అని సత్యం అంటాడు. నాన్న ఇంకెక్కడి నాన్నా. ఎప్పుడో చచ్చిపోయాడు. బీడీలు తాగి టీబీ వచ్చి పోయాడు. పదకొండో రోజు కక్కముక్కతో భోజనాలు పెట్టాం కదా అని మాణిక్యం అంటాడు.

మా వదినవాళ్ల నాన్న చనిపోయారా అని రవి అంటాడు. మావయ్య చచ్చిపోయింది మీ నాన్న. మా నాన్న కాదు. క్లారిటీగా చెప్పాలికదా అని రోహిణి అంటాడు. ఇవి మీ నాన్న పంపించినవే కదా. నేను స్క్రిప్ట్ మార్చను అని మాణిక్యం అంటాడు. దాంతో శ్రుతి డౌట్ పడుతుంది. మాణిక్యం తెచ్చిన గిఫ్ట్స్ బాలు చూడాలని రవితో వీడియో తీయిస్తుంది ప్రభావతి. మరోవైపు కొబ్బరి బొండాలు పట్టుకుని రాజేష్‌తో బాలు వస్తాడు. మీ మలేషియా మావ ఫారెన్ సరుకు తెచ్చి ఉంటాడు అని రాజేష్ అంటాడు.

ఆంటీ మీరు కూడా

వాడి బొంద. వాడు మలేషియా నుంచి వచ్చినట్లే లేడు. మా పార్లరమ్మా ఏదో మతలబు చేస్తుంది. ఎలాగైనా వాన్ని పట్టుకుని నిజం చెప్పించకుంటే నాపేరు బాలు కాదు అని బాలు అంటాడు. బాలుకు ప్రభావతి గిఫ్ట్స్ చూపిస్తుంది. చీర, డ్రెస్సు, బ్రేస్‌లెట్ అంతేగా అని సెటైర్లు వేస్తాడు బాలు. మనం గ్రూప్ ఫొటో దిగుదాం. అంటీ మీరు కూడా రండి అని మాణిక్యం అంటాడు. దాంతో ఆంటీ ఏంటీ మరిదిగారు అని ప్రభావతి షాక్ అవుతుంది.

మీరు మా రోహిణికి అక్కలా ఉన్నారు. మీ ఆంటీని ఆంటీ అన్నాను అని మాణిక్యం కవర్ చేస్తాడు. రోహిణి వాళ్ల నాన్న వంద ప్లేట్లలో సారే పంపించారు అని మాణిక్యం అంటే మిగతావి విమానంలో వస్తున్నాయా అని బాలు అంటాడు. ఈ కొబ్బరిబొండాలు కొట్టే అబ్బాయి తమాషాగా మాట్లాడుతున్నాడు అని మాణిక్యం అంటాడు. నేను కొబ్బరిబొండాలు కొట్టేవాడిలా కనిపిస్తున్నానా. మాంసం తీసుకొస్తే మాంసం అమ్మేవాన్ని అయిపోతానా అని బాలు అంటాడు.

అలా ఎలా అంటారు. మాంసం కొట్టడం ఒక కళ. ఏ మేకను ఎలా కోయాలి. బిర్యానికి, కర్రీకి ఎలా చేయాలి అని వివరంగా చెబుతాడు మాణిక్యం. రోహిణి ఆపుతాడు. మీ మావయ్య ఏంటీ మటన్ కొట్టులో పనిచేసేవాడిలా మాట్లాడుతున్నాడు అని బాలు డౌట్ పడతాడు. అబ్బబ్బా. చాలా ఉక్కగా ఉంది. ఈ టైమ్‌లో మలేషియాలో చల్లగా ఉంటుందని మాణిక్యం అంటే.. మా అమ్మనాన్న మలేషియా వెళ్లొచ్చారు. ఈ టైమ్‌లో అక్కడ వేడిగా ఉంటుందని శ్రుతి అంటుంది.

మలేషియాలో మటన్ కొట్టు

అంటే మా ఏరియాలో చల్లగా ఉంటుందని మాణిక్యం అంటే.. మలేషియాలో ఎక్కడ ఉంటారు అని శ్రుతి అక్కడి ప్లేసులు చెబుతుంది. దాంతో మీరు జాష్ టౌన్‌లో ఉంటారు కదా అని కవర్ చేస్తుంది రోహిణి. తర్వాత బాలు కొబ్బరిబొండం కొడుతుంటే.. అలా కైమా కొట్టినట్లు కాదు. బిర్యానికి కొట్టినట్లు కొట్టాలి అని మాణిక్యం అంటాడు. డౌటే లేదు మీరు మలేషియాలో మటన్ కొట్టు నడుపుతున్నారు కదా అని బాలు అంటాడు. చూశారా మా మావయ్యను ఎలా ఇన్సల్ట్ చేస్తున్నాడో చూడు అని రోహిణి అంటుంది.

దాంతో బాలును వెళ్లమంటుంది ప్రభావతి. నువ్ చెప్పిన తాగుబోతు బాలు ఇతనేనా అని మాణిక్యం అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. మీ అత్తింటి విషయాలు బాగానే చేరవేశావమ్మా అని సత్యం అంటాడు. ఇంట్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పాను అని రోహిణి అంటుంది. అలా అయితే కొన్ని విషయాలు నేను చెప్పనా అని మీనా అంటుంటే ప్రభావతి నోరు మూసి ఆపుతుంది. మాణిక్యంను రోహిణి కోపంగా చూస్తుంది.

బాలు, రాజేష్ బయటకెళ్తారు. బాటిల్ సంగతి ఏంట్రా అని రాజేష్ అంటే.. వాడు మటన్, చికెన్ తప్పా ఏం మాట్లాడట్లేదు. కానీ, మనం తాగాల్సిందే. వాడు చేత తాగాంచాల్సిందే. వాడి గుట్టు, పార్లరమ్మా గుట్టు కక్కించాల్సిందే అని బాలు అంటాడు. మళ్లీ తర్వాత మటన్ గురించే మాట్లాడుతాడు మాణిక్యం. ఇల్లు చిన్నగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి అని ప్రభావతి అంటుంది. మాది చిన్నగానే ఉంటుంది. ఈ ఇంట్లో రెండు మటన్ షాపులు పెట్టుకోవచ్చు అని మాణిక్యం అంటాడు.

మలేషియా నుంచి వచ్చినట్లు

వీడు మటన్ షాపు గోల విడిచిపెట్టేలా లేడుగా అని రోహిణి తల పట్టుకుంటుంది. మాట్లాడితే మటన్ కొట్టు అంటాడేంటే అని సుశీల అంటుంది. తర్వాత రోహిణి కవర్ చేస్తుంది. తర్వాత గదిలోకి తీసుకెళ్లిన మాణిక్యంను రోహిణి తిడుతుంది. నేను చెప్పింది మాత్రమే చేయమని మండపేట నుంచి కాకుండా మలేషియా నుంచి వచ్చినట్లు డిగ్నీఫైడ్‌గా ఉండు అని రోహిణి వార్నింగ్ ఇస్తుంది. ఇవాళ మీ మావయ్య వచ్చాడు. ఇంకోరోజు మీ నాన్న వస్తాడు అని ప్రభావతి అంటుంది.

మళ్లీ నాన్నలా ఇంకో ఆర్టిస్ట్‌ను తీసుకురావాల. ఇతనే ఏం చేస్తాడో అని రోహిణి మనసులో అనుకుంటుంది. కూరగాయలు తరగలేనని శ్రుతి మొండికేస్తుంది. సుశీల వచ్చి నేర్చుకోమని చెబుతుంది. కోపంతా కత్తిని బలంగా కొడుతుంది. దాంతో అది ఎగిరి వచ్చి ప్రభావతి ముందున్న ఆలుగడ్డలపై పడుతుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. కరివేపాకు ఎందుకు ఎలాగు పడేస్తాం కదా అని శ్రుతి అంటే.. కరివేపాకు జీవితమే అంతా తాళింపుకు అన్నింటికి మాత్రమే పనికివస్తుంది. మీ అమ్మమ్ము తెల్లజుట్టును నల్లగా చేయడానికి అని మీనాను ఉద్దేశించి అవమానంగా మాట్లాడుతుంది ప్రభావతి.

అలా అయితే మీకు కూడా పనికొస్తుంది. మీ జుట్టు కూడా గ్రే కలర్‌లో ఉందిగా అని శ్రుతి రివర్స్ తనకే పంచ్ వేస్తుంది. దాంతో రోహిణి నవ్వుతుంది. నాకేం వయసొచ్చింది. ఒక్కటో చిన్న తెల్లజుట్టు ఉందని ప్రభావతి అంటుంది. నేను రవి, మనోజ్‌తో మీ అక్కనా అంటారు అని ప్రభావతి అంటుంది. ఇంకానయం పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఇంటికి వచ్చారు అనలేదు అని సుశీల అంటుంది. ఇంతలో సత్యం వస్తాడు. ఏమైనా పని చేయమంటావా అని సత్యం అడుగుతాడు.

గ్రూప్ ఫొటో

కొబ్బరికాయలు తురమమంటుంది ప్రభావతి. మీరెందుకు మావయ్య నేను చేస్తాను అని సత్యం అంటాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా చేస్తాను. ఎవరు ఆపకండి అని సత్యం అంటాడు. తర్వాత ఆహా అద్భుతంగా ఉందని వంట మెచ్చుకున్న మాణిక్యం రోజు మిగిలిపోయిన మటనే రోజు వండి పెట్టేది అని అంటాడు. తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా గ్రూప్ ఫొటో దిగుతుంది. లవ్ సింబల్ పెట్టి అంతా పోజు ఇస్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024