



Best Web Hosting Provider In India 2024

IRCTC Special: తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం భారత్ గౌరవ్ గురుకృప యాత్ర స్పెషల్ ట్రైన్..
IRCTC Special: దేశవ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాణించే ‘భారత్ గౌరవ్ రైలు’ తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఈ నెల 23న అందుబాటులోకి రానుంది. ‘గురుకృప యాత్ర’ పేరుతో ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ క్షేత్రాలను సందర్శించేందుకు ఈ ప్రత్యేక రైలు నడుపనున్నారు.

IRCTC Special: భారత్ గౌరవ్ పర్యాటక రైలు ఏప్రిల్ 23న బయల్దేరుతుుంది. విజయవాడ నుంచి బయల్దేరే ఈ యాత్ర పది రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా విజయవాడ నుంచి బయలుదేరే ట్రైన్ గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర్, బల్లార్షా, వార్దా, నాగపూర్ ల మీదుగా వెళ్తుంది.
గురుకృప యాత్ర వివరాల కోసం ఈ లింకును అనుసరించండి.
https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SCZBG40
యాత్ర మార్గం….
భారత్‌గౌరవ్ రైలు గురుకృప యాత్రలో భాగంగా విజయవాడ నుంచి ఈ నెల 23న ఉదయం 8 గంటలకు ఈ రైలు బయలు దేరుతుంది. అదే రోజు రాత్రి 8.08 గంటలకు పెద్దపల్లికి చేరుతుంది.
25న ఉదయం 8 గంటలకు హరిద్వార్ చేరుకుంటుంది. సందర్శకులను అక్కడి బస కేంద్రానికి తరలిస్తారు. మానసదేవి ఆలయ దర్శనం, రాత్రి సమయంలో గంగా హారతి అనంతరం రాత్రి బస ఏర్పాటు చేస్తారు.
26న ఉదయం రిషికేష్ చేరుకొని గంగా స్నానాల అనంతరం రామ్ జూలా, లక్ష్మణ్ జూలా దర్శనం, రాత్రి 9 గంటలకు ఆనందాసాహెబ్ కు బయల్దేరుతుంది.
27న ఉదయం గురు ద్వారా, నైనాదేవి ఆలయాల సందర్శన అనంతరం రాత్రి 10 గంటలకు అమృత్ సర్ వెళ్తుంది.
28న తెల్లవారుజామున 4 గంటలకు హర్మిందర్ సాహెబ్, ఆకల్ తక్తా వాఘా సరిహద్దు సందర్శన అనంతరం రాత్రి 10 గంటలకు అమృత్ సర్ నుంచి మాతా వైష్ణోదేవి కాట్రాకు రైలు వెళ్తుంది.
29న తెల్లవారుజామున 5 గంటలకు కాట్రాకు చేరిన అనంతరం మాత వైష్ణో దేవి ఆలయానికి వెళ్లేందుకు భక్తులు కాలినడకన (డోలి ద్వారా వెళ్లే భక్తులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది) వెళ్తారు. రాత్రి అక్కడే బస ఏర్పాటు చేస్తారు.
30న సాయంత్రం 5.30 గంటలకు రైలు తిరుగు ప్రయాణమవుతుంది. మే 2న మధ్యాహ్నం 1.57 గంటలకు పెద్దపల్లికి చేరకుంటుంది.
సౌకర్యాలు….
ఎకానమీ స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బోగీలున్నాయి. ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులకు ఉదయం టీ, ఆల్పాహారం, లంచ్, డిన్నర్ (శాఖాహారం)ను రైల్వేశాఖ అందిస్తుంది.
టికెట్ రేట్లు…
ఎకానమి క్లాస్ లో పెద్దలకు 18510 రూపాయలు, పిల్లలకు(5 నుంచి 11ఏళ్ళలోపు) 17390 రూపాయలు,. 3ఏసి పెద్దలకు 30730 రూ.లు, పిల్లలకు 29420 రూపాయలు, సెకండ్ ఏసి పెద్దలకు 40685 రూపాయలు, పిల్లలకు 39110 రూపాయల చార్జీ వసూలు చేస్తారు. ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
భారత్ గౌరవ్ పర్యటక రైలులో టిక్కెట్లను బుక్ చేసుకోడానికి ఈ కింది లింకును అనుసరించండి.
https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SCZBG40
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్