




Best Web Hosting Provider In India 2024

Nara Lokesh: మంగళగిరిలో వెయ్యి కోట్ల విలువైన స్థలాలకు.. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన నారా లోకేష్
Nara Lokesh: ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్నాకే మళ్లీ ప్రజలముందుకు వస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. అయిదేళ్లపాటు సేవలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచానని, రూపాయి అవినీతి లేకుండా పేదలకు వెయ్యికోట్ల ఆస్తి పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.

Nara Lokesh: మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా, భారతదేశంలో నెం.1 నియోజకవర్గంగా మంగళగిరిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మనఇల్లు – మనలోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వరోజు యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు ఆవరణలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231మందికి, పద్మశాలి బజార్ కి చెందిన 127మంది పేదలకు పట్టాలను అందజేశారు.
2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో మీ ముందు నిలబెడ్డానని, నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేకపోవడం, మీ సమస్యలు తెలుసుకోలేకపోవడం, కేవలం ఎన్నికలకు 21రోజుల ముందు రావడంతో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని లబ్దిదారులకు నారా లోకేష్ చెప్పారు. ఓడినరోజు కొంచెం బాధ పడ్డా రెండోరోజు నుంచి నాలో కసి పెరిగిందన్నారు. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని. అయిదేళ్లపాటు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించా. సొంతగా 26సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశానని చెప్పారు.
సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచా
ఎన్టీఆర్ సంజీవని పేరిట తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మొబైల్ క్లినిక్ లు ఏర్పాటుచేశానని లోకేష్ చెప్పారు. 2024లో రెండోసారి మీ ముందుకు వచ్చా. గెలిస్తే ఎంత చేస్తానో ఆలోచించాలని, 53వేల ఓట్లతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరాను. ఎన్నికలకు ముందు సర్వేలో కుప్పం కంటే వెనుకబడి ఉన్నామని ఆ తర్వాత ప్రజల్లో స్పందన చూశాక కుప్పం కంటే ఎక్కువ వస్తుందని చంద్రబాబుగారికి చెప్పానన్నారు.
ఎవరూ ఊహించని విధంగా 91వేల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించారు. మంగళగిరిలో ఓడితే ఇబ్బంది అవుతుందని, 2స్థానాల్లో పోటీచేయమని కొందరు సన్నిహితులు చెప్పారు. 5సంవత్సరాలు కష్టపడి మంగళగిరి ప్రజల మనసులను గెలుచుకున్నా, మంగళగిరి ప్రజల మధ్యే ఉంటానని వారికి చెప్పానన్నారు.
రచ్చబండలో ఇచ్చిన హామీ మేరకే పేదలకు పట్టాలు
ఎన్నికలకు ముందు రచ్చబండ కార్యక్రమానికి వచ్చినపుడు ఎక్కడ నివసించే వారికి అక్కడే రెగ్యులరైజ్ చేయమని స్థానికులు నాకు విజ్ఞప్తిచేశారని వారికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 3వేలమందికి పట్టాలు అందజేస్తున్నామన్నారు. రెండో విడతలో రైల్వే, ఎండోమెంట్ భూముల్లో నివసించేవారికి ఏడాది లోగా అందజేస్తామని చెప్పారు.
జటిలమైన అటవీ భూములు, ట్యాంక్ బండ్ లపై నివసించేవారికి 3వవిడతలో 3ఏళ్లలో తప్పనిసరిగా శాశ్వత పట్టాలు అందజేస్తానన్నారు. ఎపి చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మంగళగిరి కోసం జిఓ తెస్తే అది అందరికీ ఉపయోగపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులరైజేషన్ కోసం 7వేలమంది దరఖాస్తుచేయగా, అందులో 4వేలమంది మంగళగిరి ప్రజలు ఉన్నారన్నారు.
ఈరోజు 3వేలమందికి పట్టాలు ఇస్తున్నామని పట్టాలు పొందిన లబ్ధిదారులు వాటిని రిజిస్టర్ చేసుకోవచ్చని కుటుంబ అవసరాల కోసం పట్టాలు అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. 5రోజుల్లో వెయ్యికోట్ల విలువైన భూములను ఉచితంగా అందిన్నామని పేదల పట్టాల అంశాన్ని 2వ కేబినెట్ లో అప్రూవల్ తెచ్చానని చెప్పారు.
పారదర్శకంగా రూ.వెయ్యికోట్ల ఆస్తి పంపిణీ
రచ్చబండలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్టు లోకేష్ చెప్పారు. మంగళగిరి ప్రజల చిరకాల కోరిక అయిన వందపడకల ఆసుపత్రికి ఈనెల 13వతేదీన శంకుస్థాపన చేస్తామని వివరించారు. ఈ హాస్పటల్ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేసే బాధ్యత ఎపిఎస్ఎంఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుకు అప్పగిస్తున్నట్టు చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పోలీస్ స్టేషన్లు, పార్కులు, చెరువులు, చేనేత కార్మికులకు క్లస్టర్, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వచ్చే ఎన్నికల్లో మళ్లీ మీ వద్దకు వచ్చేటప్పుడు ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్న తర్వాతే మీ ముందుకు వస్తానన్నారు.
మంగళగిరి నియోజకవర్గ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలని మీ ఇల్లు కొలతలు తీసుకోవడానికి వచ్చినపుడు జనసేన, టిడిపి, బిజెపి నాయకులు ఎవరివద్దా ఒక్క కప్పు కాఫీ తాగలేదని స్వచ్చందంగా మీకు సేవచేయడానికి వచ్చారు. ఒక్కరూపాయి అవినీతిలేకుండా వెయ్యికోట్ల ఆస్తి పేదలకు అందించామని, ఎన్ డిఎ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి లోకేష్ చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్