




Best Web Hosting Provider In India 2024

Natural Skin Care: రసాయన క్రీములకు గుడ్ బై చెప్పండి.. ఈ చిట్కాలతో సమ్మర్ లోనూ సహజ కాంతిని పొందండి!
Natural Skin Care: వేసవిలో చర్మం సూర్యకిరణాల ధాటికి దెబ్బతింటుంది. కాంతిహీనంగా మారిపోతుంది. రసాయనాలతో కూడిన క్రీములతో కాకుండా సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా చర్మాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక చెమట వల్ల చర్మానికి అనేక రకాల నష్టాలు జరుగుతాయి. ఈ సమయంలో ఉపయోగించే హెవీ కెమికల్ ఆధారిత ఉత్పత్తులు కొన్నిసార్లు అలెర్జీ వంటి అనేక సమస్యలను కలిగిస్తాయి. అలోవేరా, దోసకాయ, రోజ్ వాటర్, ముల్తాన్ని మట్టి వంటి సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా వేసవిలో చర్మ సమస్యలు చూసుకోగలం. వేడి వాతావరణానికి అనుగుణంగా సహజమైన పరిష్కారాలతో మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని పొందడానికి ఇలా చేయండి.
1. క్లెన్సింగ్:
చర్మంపై కలిగే చెమటతో పాటు వాటి వల్ల పేరుకుపోయే మురికి, అదనపు నూనెను తొలగించడానికి సున్నితమైన క్లెన్సర్లను ఉపయోగించండి.
కావాల్సిన పదార్థాలు:
- రోజ్ వాటర్ – చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.
- అలోవేరా జెల్ – ఎండ తగలడం లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలిగిన శరీరంలో వేడిని తగ్గించి శాంతింపజేయడానికి కలబంద గుజ్జు వాడండి. ఇది హైడ్రేషన్ కు కూడా తోడ్పడుతుంది.
- నిమ్మకాయ రసం – చర్మాన్ని శుభ్రపరిచి,కాంతిని అందిస్తుంది.
- వాడుకునే విధానం: కలబంద గుజ్జును రోజ్ వాటర్‌తో కలిపి క్లెన్సర్ గా తీసుకోవాలి.
2. చనిపోయిన చర్మ కణాలను తొలగించడం
ఎండ తగలడం కారణంగా, గాయాల కారణంగా చర్మంపై ఏర్పడిన మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. అలా చేయడం వల్ల చర్మంపై రంధ్రాలు మూసుకుపోకుండా, చర్మం కాంతిని కోల్పోకుండా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
- ఓట్ మీల్ – శాంతింపజేస్తుంది, చనిపోయిన కణాలను తొలగిస్తుంది.
- బియ్యం పిండి – చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది.
- తేనె, నిమ్మకాయ – సహజంగా చనిపోయిన కణాలను తొలగించడానికి ప్రభావవంతంగా ఉంటాయి.
- వాడుకునే విధానం: బియ్యపు పిండిని పెరుగుతో కలిపి వారానికి రెండుసార్లు స్క్రబ్‌గా ఉపయోగించండి.
3. చర్మాన్ని తేమగా ఉంచడం
వేసవిలో కూడా, మీ చర్మం పొడిబారిపోకుండా ఉంచుకోవడం అవసరం. పొడిగా మారిన చర్మం పగుళ్లతో పాటు చికాకును కలిగిస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
- దోసకాయ రసం – చర్మాన్ని చల్లబరచడంతో పాటు హైడ్రేషన్ లక్షణాలను కలగజేస్తుంది.
- కలబంద గుజ్జు – సూర్యుడి కిరణాల వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని సరిచేస్తుంది.
- గ్లిజరిన్ – తేమను నిలుపుకుంటుంది.
- వాడుకునే విధానం: దోసకాయ రసాన్ని కలబంద గుజ్జుతో కలిపి ఐస్ క్యూబ్స్ చేసి ముఖానికి వేయండి.
4. మీ చర్మాన్ని సహజంగా రక్షించుకోండి
సన్‌స్క్రీన్ అవసరం, కానీ సహజ ప్రత్యామ్నాయాలు అదనపు రక్షణను అందిస్తాయి.
కావాల్సిన పదార్థాలు:
- కొబ్బరి నూనె, షియా బటర్ – సూర్యుడి నుండి చర్మానికి రక్షణను అందిస్తాయి.
- క్యారెట్ విత్తనాల నూనె – సహజ SPFని కలిగి ఉంటుంది.
- టమాటో గుజ్జు – సూర్యుడి వల్ల కలిగే నష్టాన్ని సరిచేస్తుంది.
- వాడుకునే విధానం: క్యారెట్ విత్తనాల నూనె కొన్ని చుక్కలను కలబంద గుజ్జుతో కలిపి చర్మానికి రాసుకోండి.
5. చల్లబరిచే ఫేస్ ప్యాక్‌లు
సన్‌బర్న్‌ను నివారించడానికి, మీ చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఉపయోగించండి.
పరిష్కారం కోసం కావాల్సిన పదార్థాలు:
ముల్తాన్ని మట్టి (ఫుల్లర్స్ ఎర్త్) – అదనపు నూనెను గ్రహిస్తుంది.
- పెరుగు, తేనె – చర్మంపై తేమ కలిగించి శాంతించేలా చేస్తుంది.
- పుదీనా ఆకులు – తాజాదనంతో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
- వాడుకునే విధానం: ముల్తాన్ని మట్టి, రోజ్ వాటర్, పుదీనా ఆకులను కలిపి పేస్ట్ చేసి వారానికి రెండుసార్లు వేయండి.
వేసవిలో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కలబంద, రోజ్ వాటర్, ముల్తాన్ని మట్టి, దోసకాయ వంటి సహజ పదార్థాలను ఉపయోగించి దీనికి పరిష్కారం పొందొచ్చు. మీరు మీ చర్మాన్ని తాజాగా, తేమగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా కఠినమైన సూర్యుని ఎండ నుండి రక్షణ కూడా పొందొచ్చు. ఈ రకమైన జాగ్రత్తతో పాటు, నీరు త్రాగడం, తాజా పండ్లు, కూరగాయలు తినడం మీ సహజ కాంతిని పెంచుతుంది. వేసవి అంతా ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మాన్ని ఆనందించడానికి ఈ సులభమైన పరిష్కారాలను పాటించడం మొదలుపెట్టేయండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం