




Best Web Hosting Provider In India 2024

Dy Collector Death: అన్నమయ్య జిల్లాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం
Dy Collector Death: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్ కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Dy Collector Death: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్ కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిపై ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు.
సీఎం సంతాపం..
రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా సంబేపల్లె మండలం యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ తీవ్రంగా గాయపడ్డారు.
రాయచోటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రమ మృతి దురదృష్టకరమని కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురికి అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్