




Best Web Hosting Provider In India 2024

Kushi: ఖుషి మూవీని ఏదో శ్మశానంలో ఉన్నట్లు చూశారు.. సూసైడ్ చేసుకునేవాన్ని.. డైరెక్టర్ ఎస్‌జే సూర్య కామెంట్స్
SJ Suryah About Pawan Kalyan Kushi Movie First Copy Response: పవన్ కల్యాణ్ ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని తెలిసిందే. ఖుషి మూవీ హిట్ కాకపోయి ఉంటే సూసైడ్ చేసుకునేవాన్ని కావచ్చు అని ఆ మూవీ డైరెక్టర్ ఎస్‌జే సూర్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విభిన్న పాత్రలతో
ఇటీవలే చియాన్ విక్రమ్ నటించిన ధీర వీర సూరన్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు ఎస్‌జే సూర్య. ఇవే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, అగ్ర హీరో కార్తీ క్రేజీ సీక్వెల్ మూవీ సర్దార్ 2 వంటి భారీ సినిమాల్లో ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. ఇప్పడు విభిన్న పాత్రలు చేస్తూ అలరిస్తున్న ఎస్‌జే సూర్య గతంలో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఖుషి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఖుషి సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్‌జే సూర్య అందులో చిన్నగా మెరిశారు కూడా. ఇక ఖుషి మూవీ ఎంత హిట్ అయిందో తెలిసిందే. పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. అలాంటి సినిమాకు మొదట నెగెటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఎస్‌జే సూర్య చెప్పుకొచ్చారు.
ఎంత టెన్షన్ ఉన్నప్పటికీ
చియాన్ విక్రమ్ ధీర వీర సూరన్ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా క్యూ అండ్ ఏ కార్యక్రమంలో ఖుషి సినిమాపై ఎస్‌జే సూర్య షాకింగ్ కామెంట్స్ చేశారు. “యాక్టర్ అయితే మంచిగా తినాలి, పడుకోవాలి, ఫిట్‌నెస్ చూసుకోవాలి వంటివి ఉంటాయి. అదే డైరెక్టర్ అయితే అందరిని మంచిగా చూసుకోవాలి. అందరూ భోజనం చేశారా లేదా చూసుకోవాలి లోపల ఎంత టెన్షన్ ఉన్న పైకి కూల్‌గా మాట్లాడాలి” అని ఎస్‌జే సూర్య చెప్పారు.
“ఆయన యాక్టర్ ఎందుకు అయ్యారో తెలిసిందా” అని చియాన్ విక్రమ్ అన్నాడు. “మళ్లీ సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్‌నే అంటారు” అని ఓ జర్నలిస్ట్ అన్నారు. దాంతో “అవును, ఖుషి మూవీ మీరు ఇప్పుడు సూపర్ హిట్ అని చెబుతున్నారు. అది ఫస్ట్ కాపీ అందరు ఉదయం థియేటర్‌లో చూశాం. అక్కడ (చెన్నై) ఉదయం థియేటర్‌లో ఎంటైర్ సినీ ఇండస్ట్రీ అంతా ఉంటుంది. అక్కడ చూస్తున్నాం” అని ఎస్‌జే సూర్య అన్నారు.
శ్మశానంలో కూర్చున్నట్లు
“అదేదే ఒక గ్రేవ్ యార్డ్ (శ్మశానం)లో కూర్చున్నట్లు అంతా ఇలా చూస్తున్నారు. ఒక్క నవ్వు లేదు. ఏంట్రా ఇది అనుకున్నా. ఒకవేళ అది కంటిన్యూ అయి ఉంటే ఎస్‌జే సూర్య ఇక్కడ ఉండడు. నాకు కొంచెం పిచ్చి. నేను ఆత్మహత్య చేసుకునేవాన్ని. అది మాత్రం కంటిన్యూ అయితే” అని ఖుషి ఫ్లాప్ అయితే సూసైడ్ చేసుకునేవాన్ని అనే అర్థంలో నవ్వుకుంటూ చెప్పారు ఎస్‌జే సూర్య.
“ఆ నెక్ట్స్ డే.. ఆడియెన్స్ థియేటర్‌కు వచ్చి.. వచ్చి.. గ్రేవ్‌యార్డ్‌లాగా ఎలా కనిపించిందో అక్కడ ఒక ఐపీఎల్ గ్రౌండ్‌లా మారిపోయింది. ఎన్ని క్లాప్స్, ఎంత రెస్పాన్స్. ఇవన్నీ తట్టుకోవడం చాలా కష్టమండి ఒక డైరెక్టర్‌గా. డైరెక్షన్ చాలా టఫ్” అని నవ్వుకుంటూ ఎస్‌జే సూర్య వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
సంబంధిత కథనం