Hyderabad Crime : గచ్చిబౌలిలో దారుణం.. భార్యను రోడ్డుపై పడేసి.. బండరాయితో దాడి చేసిన భర్త

Best Web Hosting Provider In India 2024

Hyderabad Crime : గచ్చిబౌలిలో దారుణం.. భార్యను రోడ్డుపై పడేసి.. బండరాయితో దాడి చేసిన భర్త

Basani Shiva Kumar HT Telugu Published Apr 07, 2025 01:26 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Published Apr 07, 2025 01:26 PM IST

Hyderabad Crime : వారిద్దరు గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్య గర్భం దాల్చింది. చెకప్ కోసం ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వచ్చారు. ఏమైందో ఏమో.. భర్త ఒక్కసారిగా బండరాయితో భార్యపై దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భార్యపై భర్త దాడి
భార్యపై భర్త దాడి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గర్భిణిపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2024 అక్టోబర్ లో బెంగాల్‌కు చెందిన షబానా పర్వీన్‌తో.. మహమ్మద్ బస్‌రత్ ప్రేమ వివాహం జరిగింది. హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివాసముంటూ.. మహమ్మద్ బస్‌రత్ ఇంటీరియర్ పనులు చేస్తున్నాడు.

బండరాయితో దాడి..

ఈ క్రమంలోనే భార్య షబానా గర్భం దాల్చింది. గత నెల 29న ఆసుపత్రిలో చేరింది. డిశ్చార్చ్ అయిన తర్వాత ఆసుపత్రి ముందు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య పర్వీన్‌ను రోడ్డుపై పడేసి భర్త మహమ్మద్ బస్‌రత్ బండరాయితో దాడి చేశాడు. ప్రస్తుతం పర్వీన్ కోమాలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చనిపోయిందనుకుని..

ఆమె చనిపోయిందని అనుకున్న బస్‌రత్.. తన మోటార్ సైకిల్‌పై అక్కడి నుండి పారిపోయాడు. అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

యువతిపై అత్యాచారయత్నం..

ఇటీవల జరిగిన ఎంఎంటీఎస్ అత్యాచార ఘటన మరువకముందే.. మరో యువతిపై ఎటాక్ జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి.. దుండగులు యువతిపై అత్యాచారానికి యత్నించారు. యువతి రాయితో కొట్టి వారి బారి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరిపి, యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును రైల్వే పోలీసులకు బదిలీ చేసిన మేడ్చల్ ఠాణా సిబ్బంది వెల్లడించారు.

పెరుగుతున్న నేరాలు..

ఇటీవల హైదరాబాద్ నగరంలో క్రైమ్ పెరుగుతున్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మాదకద్రవ్యాల వినియోగం పెరగడం నేరాలకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. మాదకద్రవ్యాలకు బానిసలైన కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధాల కారణంగా ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

 

Basani Shiva Kumar

eMail

సంబంధిత కథనం

టాపిక్

HyderabadCrime TelanganaTs PoliceTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024