




Best Web Hosting Provider In India 2024

OTT Telugu Horror Comedy: తెలుగు హారర్ కామెడీ మూవీ.. మరో మూడు రోజుల్లోనే ఓటీటీలోకి.. ఐఎండీబీలో టాప్ రేటింగ్
OTT Telugu Horror Comedy: ఓటీటీలోకి 20 రోజుల్లోనే ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సోమవారం (ఏప్రిల్ 7) మరోసారి అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

OTT Telugu Horror Comedy: ఈటీవీ విన్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ మూవీ గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. అయితే మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. ఈ విషయాన్ని గత వారమే వెల్లడించిన ఆ ఓటీటీ.. సోమవారం (ఏప్రిల్ 7) మరోసారి ట్వీట్ చేసింది.
టుక్ టుక్ ఓటీటీ రిలీజ్ డేట్
కోర్ట్ మూవీ ఫేమ్ రోషన్ నటించిన మూవీ టుక్ టుక్. గత నెల 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఈ గురువారం అంటే ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెలలో రిలీజ్ కాబోయే సినిమాంటూ గత వారమే ఈ విషయాన్ని వెల్లడించిన ఆ ఓటీటీ.. తాజాగా మరోసారి ఓ ట్వీట్ ద్వారా ఇదే విషయం తెలిపింది.
“జీవితకాలపు ప్రయాణంలో మీరూ పాలుపంచుకోండి. టుక్ టుక్ ఈటీవీ విన్ లో ఏప్రిల్ 10న ప్రీమియర్ కానుంది. ఓ సరదా, భయపెట్టే, ఎమోషనల్ జర్నీ మీ కోసం వేచి చూస్తోంది. మిస్ కావద్దు. కేవలం మీ ఈటీవీ విన్ లో” అనే క్యాప్షన్ తో మూవీ పోస్టర్ ను పోస్ట్ చేసింది.
ఏంటీ టుక్ టుక్ మూవీ స్టోరీ?
ఈ టుక్ టుక్ మూవీ హారర్ కామెడీ జానర్లో తెరకెక్కింది. ఇది ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. సుప్రీత్ సి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రోషన్ తోపాటు కార్తికేయ దేవ్, శాన్వీ మేఘన, స్టీఫెన్ మధులాంటి వాళ్లు నటించారు. ఓ వెహికిల్, అందులో ఆత్మ ఉండటం, అది చేసే విన్యాసాలతో తెలుగులో గతంలో టాక్సీవాలా, కారు దిద్దిన కాపురం లాంటి సినిమాలు వచ్చాయి.
వాటికి భిన్నంగా ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ల కథతో టుక్ టుక్ మూవీ సాగుతుంది. కామెడీకి హారర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి దర్శకుడు సుప్రీత్ కృష్ణ ఈ కథ రాసుకున్నాడు. అంతర్లీనంగా పల్లెటూళ్లలో ఆడపిల్లల పట్ల ఉంటే వివక్ష, స్వేచ్ఛగా బతకాలనే తమ కలలకు ఎలాంటి అడ్డంకులు ఉంటాయన్నది ఎమోషనల్‌గా చూపించారు. సెన్సిటివ్ పాయింట్‌ను కామెడీతో చక్కగా డీల్ చేశాడు డైరెక్టర్.
ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో మూడు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈ హారర్ కామెడీని మీరూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 10 నుంచి చూడండి. ఈ టుక్ టుక్ సినిమాకు ఐఎండీబీలో మాత్రం 9.5 రేటింగ్ నమోదు కావడం విశేషం.
సంబంధిత కథనం