


Best Web Hosting Provider In India 2024

OTT Malayalam Action Movie: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి మలయాళం యాక్షన్ మూవీ.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి
OTT Malayalam Action Movie: ఓటీటీలోకి మలయాళం యాక్షన్ మూవీ ఒకటి రెండు నెలల తర్వాత వస్తోంది. ఆంటోనీ వర్గీస్ నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

OTT Malayalam Action Movie: మలయాళం ఇండస్ట్రీ నుంచి యాక్షన్ సినిమాలు వచ్చేది తక్కువే. గతేడాది చివర్లో మార్కో రూపంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రాగా.. ఈ ఏడాది మరో యాక్షన్ మూవీ దావీద్ (Daveed) వచ్చింది. ఓ విఫల బాక్సర్ చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
దావీద్ ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం మూవీ దావీద్ ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఏప్రిల్ 18 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మధ్య కాలంలో మెల్లగా మలయాళం సినిమాల హక్కులను దక్కించుకోవడంలో వేగం పెంచుతున్న జీ5.. ఈ దావీద్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.
గోవింద్ విష్ణు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్ తోపాటు లిజోమోల్ జోస్, సైజు కురుప్ లాంటి వాళ్లు నటించారు. జీ5 ఓటీటీలో ఈ మూవీని ఫ్రీగానే చూసే వీలుంది. మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.
దావీద్ స్టోరీ ఏంటంటే?
దావీద్ మూవీ ఓ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. తన కెరీర్లో విఫలమైన ఓ మాజీ బాక్సర్ చుట్టూ తిరుగుతుంది. ఆ బాక్సర్ ఆషిక్ అబు పాత్రలో ఆంటోనీ వర్గీస్ నటించాడు. ఫోర్ట్ కొచ్చి బ్యాక్‌డ్రాప్ లో కథ సాగుతుంది. ఈ మూవీలో ఆంటోనీ భార్య పాత్రలో లిజోమోల్ జోస్ నటించింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో యాక్షన్, హ్యూమర్, ఎమోషన్ కలగలసి ఉన్నాయి.
ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడింది. దావీద్ మూవీని సెంచురీ మ్యాక్స్ జాన్, మేరీ ప్రొడక్షన్స్, పనోరమ స్టూడియోస్ నిర్మించాయి.
జీ5లోని మలయాళం మూవీస్
జీ5లోకి ఈ మధ్యే మరో మలయాళ హిట్ థ్రిల్లర్ మూవీ కూడా స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన ఐడెంటిటీ మూవీ జీ5లో అందుబాటులో ఉంది.
టొవినో థామస్, త్రిషలాంటి వాళ్లు నటించిన ఈ థ్రిల్లర్ మూవీ కూడా ఆకట్టుకుంటోంది. దీంతోపాటు క్వీన్ ఎలిజబెత్, నూనక్కుజిలాంటి సినిమాలు కూడా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం