




Best Web Hosting Provider In India 2024

Youtube Thriller Movie: యూట్యూబ్‌లో తెలుగులోనూ ఫ్రీగా అందుబాటులో ఉన్న మలయాళం థ్రిల్లర్.. చిన్న పిల్లలను చంపే పిల్లాడు
Youtube Thriller Movie: యూట్యూబ్‌లో ఎంతో కంటెంట్ ఫ్రీగా చూసే అవకాశం ఉంటుంది. వాటిలో ఎన్నో థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటిదే ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ కూడా. చిన్న పిల్లలను చంపే పిల్లాడి కథతో వచ్చిన ఈ మూవీ ఓ బ్లాక్‌బస్టర్.

Youtube Thriller Movie: సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ సినిమాలంటే ఇష్టపడే వారు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ సినిమాను మిస్ కావద్దు. ఓటీటీ అయితే సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. కానీ యూట్యూబ్ లో ఎవరైనా ఫ్రీగా చూసే వీలుండే ఎన్నో మూవీస్ ఉన్నాయి. అందులో ఇదీ ఒకటి. ఎన్నో మలయాళం సినిమాలు తెలుగులో డబ్ చేసి వాటిని ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నారు.
సైకలాజికల్ థ్రిల్లర్.. ఫోరెన్సిక్
మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఫోరెన్సిక్ (Forensic). టొవినో థామస్, మమతా మోహన్‌దాస్, సైజు కురుప్ లాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. 2020లో రిలీజైన ఈ మూవీకి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
2022లోనే జీ5 ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమా యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉంది. అది కూడా తెలుగులో కావడం విశేషం. జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లు యూట్యూబ్ లో చూడొచ్చు.
ఫోరెన్సిక్ మూవీ స్టోరీ ఏంటంటే?
ఫోరెన్సిక్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో టొవినో థామస్ ఓ ఫోరెన్సిక్ నిపుణుడిగా, మమతా మోహన్ దాస్ ఓ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఓ సైకో కిల్లర్, అతడు చేసే హత్యలు, దీనికోసం చిన్న పిల్లలను అతడు వాడుకునే తీరు, పిల్లలనే లక్ష్యంగా చేసుకోవడం.. చివరి వరకూ ట్విస్టులతో సాగే కథనం ఫోరెన్సిక్ మూవీని ఓ మస్ట్ వాచ్ గా చేసేశాయి.
తనను రోజూ చిత్ర హింసలు పెట్టే కన్న తండ్రినే ఓ పిల్లాడు హత్య చేయడంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా చిన్న పిల్లలు హత్యకు గురవుతుంటారు. ఈ హత్యల కేసులో పోలీసులకు సాయం చేయడానికి ఫోరెన్సిక్ నిపుణుడు రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో అసలు హంతకుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర అతనిదే.
ఫోరెన్సిక్ ఎలా ఉందంటే?
సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్ లో ఎన్నో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. అయితే ఫోరెన్సిక్ మూవీలో మాత్రం చిన్న పిల్లలనే లక్ష్యం చేసుకోవడం, ఆ పిల్లల హంతకులు ఒకరికి మించడం ఉండటం అనేది ఈ ఫోరెన్సిక్ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. కిల్లర్ ఎవరన్న విషయంలో వచ్చే ట్విస్టులు థ్రిల్ ను పంచుతాయి. లీడ్ రోల్లో నటించిన టొవినో థామస్ నటన బాగుంది.
చాలా వరకు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల్లో అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందన్నదానిపైనే ఎక్కువగా దృష్టిసారిస్తారు. కానీ ఈ మూవీలో మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ లో కీలకంగా మారే ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఎలా పని చేస్తుందో కాస్త లోతుగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఫోరెన్సిక్ సినిమాను ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే యూట్యూబ్ లో ఫ్రీగా చూసేయండి.
సంబంధిత కథనం