




Best Web Hosting Provider In India 2024

Kousalya Tanaya Raghava: అది చూసే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు.. నటుడు ఆర్కే నాయుడు కామెంట్స్
RK Naidu About Kousalya Tanaya Raghava Trailer In Launch: తెలుగు విలేజ్ లవ్ ఎమోనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా కౌసల్య తనయ రాఘవ. రీసెంట్‌గా కౌసల్య తనయ రాఘవ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు ఆర్కే నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

RK Naidu About Kousalya Tanaya Raghava Trailer: మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు వచ్చి చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం వెండితెరపై మాస్, మసాలా, యాక్షన్, కామెడీ చిత్రాలే కనిపిస్తున్నాయి. కానీ, స్వచ్ఛమైన వింటేజ్ విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాలు కనిపించడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేందుకు ‘కౌసల్య తనయ రాఘవ’ చిత్రం రాబోతోంది.
కుటుంబమంతా కలిసి చూసేలా
రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్స్‌గా ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా కౌసల్య తనయ రాఘవ మూవీని అడపా రత్నాకర్ నిర్మించారు. ఈ మూవీకి స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వర్తించారు.
కౌసల్య తనయ రాఘవ ట్రైలర్ లాంచ్
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కౌసల్య తనయ రాఘవ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆర్కే నాయుడు, చంటి, నిర్మాత రత్నాకర్ సంయుక్తంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కౌసల్య తనయ రాఘవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యాక్టర్ ఆర్కే నాయుడుతోపాటు పలువురు ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపారు.
అందరికీ నచ్చుతుంది
నటుడు ఆర్కే నాయుడు మాట్లాడుతూ .. “కౌసల్య తనయ రాఘవ ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను చూసే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఇందులో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఆ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్” అని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ పేరు వస్తుంది
హీరో రాజేష్ మాట్లాడుతూ .. “నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కౌసల్య తనయ రాఘవ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 11న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి” అని అన్నాడు.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా
దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ .. “కౌసల్య తనయ రాఘవ సినిమా అద్భుతంగా వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నిర్మాత రత్నాకర్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాజేష్, శ్రావణి, ఆర్కే నాయుడు ఇలా అందరూ అద్భుతంగా నటించారు. మా చిత్రం ఏప్రిల్ 11న రాబోతోంది. అందరూ చూడండి” అని పేర్కొన్నారు.
ఏప్రిల్ 11న చూడండి
నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ .. “కౌసల్య తనయ రాఘవ సినిమాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రాన్ని స్వామి పట్నాయక్ అద్భుతంగా తెరకెక్కించారు. రాజేష్, శ్రావణి చక్కగా నటించారు. మా చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి” అని చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం